iDreamPost
android-app
ios-app

Prithviraj Sukumaran: దేవా….యుద్ధభూమిలో కలుద్దాం….

  • Published Mar 11, 2024 | 8:22 AM Updated Updated Mar 11, 2024 | 8:22 AM

ఫ్రుధ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన గోట్‌ లైఫ్‌ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్‌ సైంత ప్రశంసలు కురిపించాడు. డార్లింగ్‌ కామెంట్స్‌పై స్పందిస్తూ.. ఫ్రుధ్వీరాజ్ సుకుమారన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

ఫ్రుధ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన గోట్‌ లైఫ్‌ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభాస్‌ సైంత ప్రశంసలు కురిపించాడు. డార్లింగ్‌ కామెంట్స్‌పై స్పందిస్తూ.. ఫ్రుధ్వీరాజ్ సుకుమారన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

  • Published Mar 11, 2024 | 8:22 AMUpdated Mar 11, 2024 | 8:22 AM
Prithviraj Sukumaran: దేవా….యుద్ధభూమిలో కలుద్దాం….

మొన్నీ మధ్యనే విడుదలైన ద గోట్ లైఫ్ ఆఫీషియల్ ట్రైలర్ ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంది. మూస సినిమాలా లేనే లేదు. నెక్ట్స్ లెవెల్. ఈ మధ్య రోజుల్లో ఇటువంటి విజువల్స్ గానీ, లోకేషన్స్ గానీ ఆడియన్స్ ఎప్పుడూ చూడలేదు. ఆఫ్ కోర్స్….కథే అలాంటింది. ఫ్రుధ్వీ రాజ్‌ సుకుమారన్ తీసుకున్న కథ, ఎంచుకున్న దర్శకుడు.. టోటల్ కాంబినేషనే ఢిపరెంట్ పాటర్న్.

ఇండియాలో తెరకెక్కుతున్న దాదాపుగా ప్రతీ సినిమా వరల్డ్ సినిమా స్టాండర్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి వస్తున్న సినిమాలు.. ప్రపంచస్థాయి సినిమా విలువలను, ప్రమాణాలను చేరుకునే దిశగా ఏ మాత్రం టెక్నికల్ వేల్యూస్ ప్రజెంటేషన్లో రాజీ అన్నదే లేకుండా రూపొందుతున్నాయనడానికి గోట్ లైఫ్ ట్రైలరే ప్రత్యక్షనిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పుడైతే త్రిబుల ఆర్ ఆస్కార్ స్టేజ్ మీద సందడి చేసి, ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిందో.. అదే పెద్ద ఇన్సిపిరేషన్ గా తర్వాతి సినిమాల మేకింగ్ పూర్తిగా మారిపోయి, హాలీవుడ్ సినిమాల సరసన సీటు సంపాదించుకునే పనిలో పడ్డాయి.

Prithviraj Sukumaran

ఎడారిలో ఫ్రుధ్వీరాజ్ మట్టికొట్టుకుపోయి కనిపించే విజువల్స్ మనం సాధారణంగా రెగ్యులర్ సినిమాలలో చూడం.ఈ మధ్యే వచ్చిన గామి సినిమా కూడా అంతే. ఆరు కోట్ల వ్యయంతో, అదీ క్రౌడ్ ఫండింగ్ తో, ఆరేళ్ళ పాటు నిర్విరామంగా కష్టపడి తీశారు. ప్రతీ షాటు, ప్రతీ ఫ్రేము అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యద్భుతమైన మోడల్ లో తీశారు. దానికే ఈ రోజున గామి అందరినీ ఆకట్టుకోగలుగుతోంది.

గోట్ లైఫ్ ట్రైలర్ చూసిని ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్ ఎక్కడా అరమరికలు లేకుండా, ఎంతో నిజాయితీగా తన ఎక్స్ హేండిల్ నుంచి ప్రుధ్వీని మెచ్చుకుంటూ అభినందనలు తెలిపాడు. ఇది ఓ రకంగా గోట్ లైఫ్ సినిమా ప్రమోషన్ కి వీర లెవెల్లో ఉపయోగపడింది. ఈ రోజున ఇండియా మొత్తం మీద గోట్ లైఫ్ సినిమా గురించి వైడ్ రేంజ్ లో డిస్కస్ చేసుకోవడానికి దోహదపడిందనే చెప్పాలి. ప్రభాస్ రేంజ్ అంది. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్టోరియల్ సలార్ లో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రుధ్వీ ఈజీగా అందరి గుండెల్లో ఒక్కసారిగా మెదిలాడు.

Prithviraj Sukumaran

అందుకే ప్రుధ్వీ కూడా వెంటనే ప్రభాస్ కామెంటుకి స్పందించి ధెంక్స్‌ చెప్పాడు. ధెంక్స్‌ చెప్పడమే కాక.. ‘’దేవా…..త్వరలో యుద్ధభూమిలో కలుద్దాం’’ అని స్పెషల్ గా రియాక్ట్ అయ్యాడు. ఇదో రకంగా మా కాంబినేషన్లో సలార్ 2 వస్తోంది అని నెటిజన్లకి చెప్పి, గోట్ లైఫ్ మీద ఆసక్తిని పెంచే సమయస్ఫూర్తి కూడా అందులో ఉంది. ప్రభాస్, ప్రుధ్వీ కాంబోలో రాబోతున్న సలార్ 2, 2025 లో విడుదలకు సిద్ధమవుతోంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom