iDreamPost
android-app
ios-app

బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన డాక్టర్‌ బాబు-వంటలక్క… పవర్‌ఫుల్‌ క్యారెక్ట్‌ర్‌లో!

  • Published Jun 24, 2023 | 12:05 PM Updated Updated Jun 24, 2023 | 12:05 PM
  • Published Jun 24, 2023 | 12:05 PMUpdated Jun 24, 2023 | 12:05 PM
బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన డాక్టర్‌ బాబు-వంటలక్క… పవర్‌ఫుల్‌ క్యారెక్ట్‌ర్‌లో!

సినిమాలు, సీరియల్స్‌లో కొన్ని జోడీలు హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాయి. వారు తెర మీద కనిపిస్తే.. ప్రేక్షకులు మురిసిపోతారు. అలా బుల్లితెర మీద ఎవర్‌గ్రీన్‌ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంట.. స్టార్‌ మాలో ప్రసారం అయిన కార్తీకదీపం సీరియల్‌ జోడీ దీప-కార్తీక్‌ అలియాస్‌ డాక్టర్‌బాబు-వంటలక్క. వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్‌.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. టెలివిజన్‌ చరిత్రలో ఈ సీరియల్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరించారంటే.. తెర మీద దీప ఏడిస్తే.. వీరు ఏడ్చారు. డాక్టర్‌ బాబు-వంటలక్క త్వరగా కలిసిపోవాలంటూ పూజలు చేశారు. లేడీ విలన్‌ మోనితను ఓ రేంజ్‌లో ఆడిపోసుకున్నారు. ఇక సీరియల్లో నటించిన ఒక్కరు తమ టాలెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. మరీ ముఖ్యంగా హిమ, శౌర్య పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

కొన్నేళ్ల పాటు బుల్లితెరపై నంబర్‌ వన్‌ సీరియల్‌గా రాణించిన కార్తీకదీపం సీరియల్‌ కొన్ని నెలల క్రితం అయిపోయింది. ఆ సీరియల్‌లో కార్తీక్‌ పాత్రలో నటించి.. డాక్టర్‌ బాబుగా ప్రేక్షకుల చేత పిలిపించుకున్న నిరుపమ్‌ పరిటాల.. ప్రస్తుతం వేరే సీరియల్స్‌లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ దీప మాత్రం.. కార్తీకదీపం సీరియల్‌ తర్వాత తెలుగులో ఏ సీరియల్‌లో కనిపించలేదు. కార్తీక్‌ దీపం లాస్ట్‌ ఏపిసోడ్‌లో ఈ సీరియల్‌ సెకండ్‌ పార్ట్‌ ఉంటుంది అనే ట్విస్ట్‌ ఇచ్చారు. దాంతో కార్తీకదీపం అభిమానులు సెకండ్‌ పార్ట్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణ ఫలించి డాక్టర్‌బాబు-వంటలక్క జోడి మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలా అంటే..

ఈ ఆదివారం ఉంచి తెలంగాణలో బోనాలు మొదలవతాయి. ఇక ఏం పండుగ ఉన్నా సరే.. టీవీ చానెల్స్‌ ప్రత్యేక షోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. బోనాల నేపథ్యంలో స్టార్‌ మా.. మా బోనాల జాతార పేరుతో ఈ ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. దీనిలో అన్ని సీరియల్‌ జోడీలు సందడి చేయనున్నాయి. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్‌ జోడీ డాక్టర్‌బాబు-వంటలక్కలు తెర మీద మరోసారి కనపించి సందడి చేశారు. తమ అభిమాన జోడి.. అదే పాత్రల్లో మరోసారి తెర మీద కనిపించడంతో.. ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. ఇక ఈ షోలో మోనిత కూడా ఉంది. దీప మహిషాసుర మర్ధినిగా.. స్టేజీ మీద మరోసారి తన విశ్వరూపం చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş