DV Raju
మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ప్రేమలు సినిమా మాత్రం అందరి హార్ట్స్ దోచేసింది.ఇప్పటికే సిక్వెల్ గురించి అనౌన్స్ చేసినా కానీ.. అది ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మలయాళ మీడియా నుంచి వచ్చిన కథనాల ప్రకారం
మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ప్రేమలు సినిమా మాత్రం అందరి హార్ట్స్ దోచేసింది.ఇప్పటికే సిక్వెల్ గురించి అనౌన్స్ చేసినా కానీ.. అది ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మలయాళ మీడియా నుంచి వచ్చిన కథనాల ప్రకారం
DV Raju
మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ వాటిలో ప్రేమలు సినిమా మాత్రం అందరి హార్ట్స్ దోచేసింది. అందరికి ఈ మూవీ రెఫ్రెషింగ్ గా అనిపించింది. ముఖ్యంగా యూత్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే తెలుగు డబ్బింగ్ ఫార్మాట్ లో రిలీజ్ అయినా ఈ మూవీ.. డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. మమిత బైజుకు అయితే కుర్రకారు ఫిదా అయిపోయారు. అయితే ఈ మూవీ టీం ఆల్రెడీ ప్రేమలు 2 ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సిక్వెల్ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి.
ఇప్పటికే సిక్వెల్ గురించి అనౌన్స్ చేసినా కానీ.. అది ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మలయాళ మీడియా నుంచి వచ్చిన కథనాల ప్రకారం రెండవ పార్ట్ కూడా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగనుందట. అదే జంట మధ్యన నవ్వులు , ఎమోషన్స్ అన్ని మిక్స్ చేస్తూ ఇంకా అద్భుతంగా వారి ప్రేమ కథను చూపిస్తారంట మేకర్స్. సో ఈ సెకండ్ పార్ట్ కూడా ఇంతే క్రేజ్ సంపాదించుకుంటుంది అంటున్నారు. ఇక ఈ సినిమా దాదాపు ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంటుందని టాక్. సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోయినా సరే.. ప్రేమలు 2 పై మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గడం లేదు. త్వరలోనే మేకర్స్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. సరైన కంటెంట్ తో వస్తే కనుక ఈ సిక్వెల్ కు మొదటి పార్ట్ కంటే కూడా ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.