iDreamPost
android-app
ios-app

Mamitha Baiju: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన ప్రేమలు హీరోయిన్ మమిత బైజు

  • Published Mar 20, 2024 | 11:46 AM Updated Updated Mar 20, 2024 | 12:38 PM

ప్రేమలు అనగానే ఇప్పుడు ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు మమిత బైజు. ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఎంతలా మారిపోయిందో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. దీనితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు పెంచిన రెమ్యూనిరేషన్స్ గురించి తెలిస్తే అందరు ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రేమలు అనగానే ఇప్పుడు ముందుగా అందరికి గుర్తొచ్చే పేరు మమిత బైజు. ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఎంతలా మారిపోయిందో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. దీనితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు పెంచిన రెమ్యూనిరేషన్స్ గురించి తెలిస్తే అందరు ఆశ్చర్యపోవాల్సిందే.

  • Published Mar 20, 2024 | 11:46 AMUpdated Mar 20, 2024 | 12:38 PM
Mamitha Baiju: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన ప్రేమలు హీరోయిన్ మమిత బైజు

కాలం మారుతోంది .. అలాగే కాలంతో పాటు తరం కూడా మారుతోంది. వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీఠగా నిలిచినా సినీ ఇండస్ట్రీలోనూ.. రోజు రోజుకు ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారి వారి అదృష్టాన్ని బట్టి.. తీసిన కొన్ని సినిమాలకే బాగా పాపులర్ అయిపోతున్నారు. దీనితో వారు ఒక్కసారిగా వారి వారి రెమ్యూనిరేషన్స్ ను కూడా పెంచేస్తున్నారు. నిన్న మొన్నటివరకు సినీ పబ్లిక్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ .. ప్రేమలు ఫేమ్ మమిత బైజు. ఒక్క మలయాళ డబ్బింగ్ సినిమాతో .. సౌత్ లో మమిత రేంజ్ ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది. ఈ బ్యూటీకి వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీనితో ఈ భామ తన పారితోషకాన్ని పెంచేసిందట.

మమిత బైజు విషయానికొస్తే ఆమె 2017 లో నటిగా .. మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె మలయాళంలో నటించిన కోకో, సూపర్ శరణ్య, లాంటి సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక తర్వాత రీసెంట్ గా ప్రేమలు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీ కేవలం మళయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు భాషల్లో కూడా ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే, మమిత గతంలో సూర్య నటించబోయే ఓ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. కానీ, కొన్ని కారణాల వలన సూర్య ఆ చిత్రం నుంచి తప్పుకోవడంతో .. మమిత కూడా తప్పుకుంది. ఆ మూవీ డైరెక్టర్ తనను కొట్టారని, తనను దుర్భాషలాడారని చెప్పుకొచ్చింది. ఈ వార్తలు ఆ సమయంలో చాలా చర్చనీయాంశం అయ్యాయి. అయితే,కారణాలు ఏమై ఉంటాయో తెలీదు కానీ, మళ్ళీ తానే ఆ మాటలు వెనుకకు తీసుకుని.. ఆ దర్శకుడు వద్ద నుంచే నేను కెరీర్ లో ఎలా ఎదగాలి అనేది నేర్చుకున్నాను అంటూ.. చెప్పుకొచ్చింది.

Premalu heroine with increased remuneration

ఇక ప్రస్తుతం మమిత . ప్రకాశ్ కుమార్ కు జంటగా.. ఓ సినిమాతో కోలీవుడ్ లో పరిచయం అవ్వబోతుంది. ఆ తర్వాత విష్ణు విశాల్ కు జోడిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటు తెలుగులోనూ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కు జోడిగా మమితను కన్సిడర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాలతో మమిత బిజీ బిజీ గా మారిపోయింది. దీనితో ఆమెకు వస్తున్న ఆఫర్స్ ను దృష్టిలో ఉంచుకుని.. మమిత తన రెమ్యూనిరేషన్ ను పెంచేసిందనే టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు మమిత ఒక సినిమాకు సుమారు రూ.30 లక్షల వరకు రెమ్యూనిరేషన్ తీసుకునేదట. ఇప్పుడు అది కాస్త రూ.50 లక్షల వరకు చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో మమిత తన రెమ్యూనిరేషన్ ను ఏ స్థాయికి పెంచుతుందో చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş