iDreamPost
android-app
ios-app

Mamitha Baiju: వీడియో: ప్రేమలు పాప.. మళ్ళీ మాయ! స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసింది!

  • Published Mar 14, 2024 | 6:28 PM Updated Updated Mar 14, 2024 | 6:28 PM

ప్రేమలు సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే భారీగా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు ఇప్పుడు అందరి ఫేవరేట్ అయిపొయింది.

ప్రేమలు సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే భారీగా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు ఇప్పుడు అందరి ఫేవరేట్ అయిపొయింది.

  • Published Mar 14, 2024 | 6:28 PMUpdated Mar 14, 2024 | 6:28 PM
Mamitha Baiju: వీడియో: ప్రేమలు పాప.. మళ్ళీ మాయ! స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసింది!

తెలుగు ఆడియన్స్ కథలను బట్టి సినిమాలను ఏ రేంజ్ లో ఆదరిస్తారో అందరికి తెలిసిందే. ముఖ్యంగా మలయాళీ సినిమాలు ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఇక ఈ సినిమాలలో నటించే హీరోయిన్స్ ఇంకా ప్రత్యేకంగా నిలుస్తారు. ప్రస్తుతం “ప్రేమలు” సినిమాలో నటించిన మమిత బైజుకు కూడా ఇలాంటి అభిమానమే దక్కుతుంది. ఇప్పటికే కుర్రాలంతా క్రష్ లిస్ట్ లోకి యాడ్ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా మమిత బైజు పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కుర్రాలంతా ఈ అమ్మడి గురించి సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు. “ప్రేమలు” సినిమాలో మమిత యాక్టింగ్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు .. మూవీ లవర్స్ అంత ఫిదా అయిపోయారు. దీనితో ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

సోషల్ మీడియాలో మమిత గురించి సెర్చ్ చేస్తున్న క్రమంలో తాజాగా.. ఈ అమ్మడి టాలెంట్ బయటపడింది. ఆ వీడియోలో మమిత అందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో.. సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇక వీడియోలో ఈమె డ్యాన్స్ చూసిన అభిమానులు మరోసారి ఫిదా అయిపోయారు. అయితే, “ప్రేమలు” మూవీ మమిత కు మొదటి సినిమా ఏమి కాదు. ఈ సినిమాకంటే ముందు చాలా సినిమాలలో మమిత నటించింది. కానీ, ఆ సినిమాలన్నిటిలో ఈ సినిమాకె మమితకు ప్రశంసలు దక్కాయి. ఓ రకంగా “ప్రేమలు” సినిమా మమిత కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని చెప్పి తీరాలి. ఈ సినిమాతో ఒక్కసారిగా ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో కూడా మమిత బాగా ఎమోషనల్ అయ్యి మాట్లాడింది. ఏదేమైనా అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియనట్టు.. మమిత కు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు గడిచిన తర్వాత.. ‘ప్రేమలు’ సినిమా రూపంలో వరించింది.

ఇక మమిత విషయానికొస్తే.. ఈ భామ కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈమె కుటుంబం అంతా కూడా డాక్టర్స్. డాక్టర్స్ కుటుంబంలో పుట్టినప్పటికీ ఈమె చిన్నపటినుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత కూడా.. ఆమె మరోవైపు సైకాలజీలో డిగ్రీ చేస్తోంది. ఇప్పటివరకు మలయాళీ సినిమాలనే చేస్తున్న మమిత.. ఇక తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో వేచి చూడాలి. ఒకవేళ తెలుగులో కనుక ఈ అమ్మడికి మంచి కథ వస్తే.. మమిత క్రేజ్ ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి డైరెక్ట్ తెలుగు మూవీ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş