దేవరతో ప్రశాంత్ నీల్ 3000 కోట్ల మూవీ! బాక్సాఫీస్ ని మడతెట్టేసే ప్లాన్..

Prashanth Neel: ఆచార్య లాంటి ప్లాప్ ఇచ్చాడు కాబట్టి ఆ దర్శకుని మేకింగ్ మీద.. ఎక్కడో కాస్త జంకారు అభిమానులు. కానీ రిలీజ్ తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక అప్పుడే దేవర రూ.3000 కోట్ల మూవీ తీసేందుకు ప్లాన్ లో ప్రశాంత్ నీల్. ఆ వివరాలేంటో చూసేద్దాం.

Prashanth Neel: ఆచార్య లాంటి ప్లాప్ ఇచ్చాడు కాబట్టి ఆ దర్శకుని మేకింగ్ మీద.. ఎక్కడో కాస్త జంకారు అభిమానులు. కానీ రిలీజ్ తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక అప్పుడే దేవర రూ.3000 కోట్ల మూవీ తీసేందుకు ప్లాన్ లో ప్రశాంత్ నీల్. ఆ వివరాలేంటో చూసేద్దాం.

దేవరతో తారక్ ప్లాప్ దర్శకుల పాలిట వరంగా మారాడు . ఇది తారక్ గ్యారేజ్ ఇచట ప్లాప్ దర్శకులకు హిట్స్ ఇవ్వబడును. 23 ఏళ్ళ రాజమౌళి మిత్ ను బ్రేక్ చేశాడు. దేవర ముంగిట నువ్వెంత అంటూ.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను మడతపెడుతున్నాడు. అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే.. దేవర కథకు మించి దేవర గురించి కథ కథలుగా చెప్పుకుంటున్నారు. దేవర రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు  కానీ , ఈ రేంజ్ హిస్టరీని, ఫ్యూచర్ లో మిస్టరీస్ ను క్రియేట్ చేసే ప్లాన్ ను ఇస్తుందని మాత్రం అనుకోలేదు. ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత దర్శకుని మేకింగ్ గురించి ఎక్కడో కాస్త జంకారు అభిమానులు. కానీ రిలీజ్ తర్వాత ఆ భయాలన్నీ పటా పంచలయ్యాయి. రాబోయే సినిమాలకు కూడా దేవర సాయం చేస్తుంది. ఎందుకంటే దేవర గ్రాండ్ ఓపెనింగ్స్ చూసి.. నెక్స్ట్ రాబోయే సినిమాల థియేట్రికల్ రైట్స్ డిమాండ్ పెరుగుతుందట. ఇక ఇప్పుడు దేవర ఎంత వసూళ్లు చేస్తుందో తెలియదు కానీ.. ప్రశాంత్ నీల్ మాత్రం తన సినిమాతో రూ.3000 కోట్లు వసూళ్లు చేసే ప్లాన్ ను రెడీ చేస్తున్నాడట.

కె.జి.ఎఫ్ , సలార్ లాంటి చిత్రాలతో ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేశాడు. ఇక తారక్ ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే టైటిల్ కన్ఫర్మ్ చేయకుండా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సో ప్రస్తుతం ఎన్టీఆర్ తో సలార్ ను మించిన రేంజ్ లో మూవీ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3000 కోట్ల స్ట్రాటజీని ప్లాన్ చేస్తున్నాడు. 3000 కోట్ల వసూళ్ల మూవీ ఇప్పటివరకు ఇండియా హిస్టరీలోనే రాలేదు. ఓ మూవీ రిలీజ్ అయ్యాక.. వచ్చే హిట్ టాక్ ను బట్టీ 1000 కోట్లు లేదా 1500 కోట్లు వస్తాయని చెప్పొచ్చు. కానీ అసలు సినిమా షూట్ కూడా స్టార్ట్ చేయకముందే.. 3000 కోట్లు వస్తాయని చెప్పడం భ్రమ. కానీ తారక్ విషయంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క వెనుక మ్యాన్ ఆఫ్ ది మాస్ అనే లక్ ఉంది. దీనిని ప్రశాంత్ నీల్ టీమ్ బలంగా నమ్ముతున్నారు. ప్రశాంత్ నీల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ ను మడతెట్టేసే ప్లాన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇప్పటివరకు ఇండియాలో వసూళ్ల పరంగా దంగల్ మూవీ 2000 కోట్లతో టాప్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో 1850 కోట్లతో బాహుబలి-2 ఉంది. 1200 కోట్లతో కేజిఎఫ్2 , ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. ఆ తర్వాత 900 కోట్లతో సలార్ , 750 కోట్లతో యానిమల్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రికార్డ్స్ ను బ్రేక్ చేసే మూవీనే రాలేదు. అంతెందుకు బాహుబలి2 తాలూకా వసూళ్లను ఆర్ఆర్ఆర్ తో రాజమౌళినే రీచ్ కాలేకపోయాడు. మరి ప్రశాంత్ నీల్ ఈ హిస్టరీని క్రియేట్ చేయగలుగుతాడా అనే సందేహం వస్తుంది. కానీ బలమైన కంటెంట్, తెలివైన మార్కెటింగ్ సింక్ అయితే లక్ కూడా ట్రాక్ లోకి వచ్చేస్తుంది. బంగ్లాదేశ్ లో సెట్టిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ మయన్మార్ , వియాత్నం మాఫియాతో పోరాడే స్టోరీ లైన్ తో తెరకెక్కబోతుంది ఈ మూవీ. మూవీ బ్యాక్డ్రాప్ చూస్తుంటే మతి పోగొట్టేలా ఉంది. బంగ్లాదేశ్ , మయన్మార్ , వియాత్నం , థాయిలాండ్ , సింగపూర్ , జపాన్ , ఇండోనేషియా , మలేషియాల్లో ఒకేసారి మూవీని రిలీజ్ చేసేలా.. అక్కడి మార్కెటింగ్ టీమ్స్ తో కూడా టచ్ లోకి వెళ్లిందట ఫిల్మ్ టీం. మరి ఈ రేంజ్ లో పక్కా ప్లానింగ్ ఉంటే 3000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం పెద్ద విషయమేమి కాదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments