iDreamPost
android-app
ios-app

KGF 3పై ప్రశాంత్ నీల్ క్రేజీ అప్డేట్! ఈసారి రాఖీ భాయ్ విశ్వరూపం!

  • Published May 08, 2024 | 6:58 PM Updated Updated May 08, 2024 | 6:58 PM

ప్రశాంత్ నీల్ .. మంచి జోష్ మీదున్నాడు. సలార్ విజయంతో దూకుడు మీద సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. సలార్ 2 ఈ నెల చివరిలో పట్టాలెక్కుతుండగా.. తారక్ మూవీ కూడా ఈ ఏడాది చివరిలో స్టార్ట్ కానుంది. కాగా,

ప్రశాంత్ నీల్ .. మంచి జోష్ మీదున్నాడు. సలార్ విజయంతో దూకుడు మీద సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. సలార్ 2 ఈ నెల చివరిలో పట్టాలెక్కుతుండగా.. తారక్ మూవీ కూడా ఈ ఏడాది చివరిలో స్టార్ట్ కానుంది. కాగా,

  • Published May 08, 2024 | 6:58 PMUpdated May 08, 2024 | 6:58 PM
KGF 3పై ప్రశాంత్ నీల్ క్రేజీ అప్డేట్! ఈసారి రాఖీ భాయ్ విశ్వరూపం!

కేజీఎఫ్ ఫ్రాంచేజీ మూవీలతో ఏకకాలంలో టాలీవుడ్,బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. యష్‌తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తెరకెక్కించి కన్నడ చిత్ర పరిశ్రమకు దిక్సూచిగా మారాడు. గత ఏడాది సలార్- ది సీజ్ ఫైర్‌తో మరోసారి సత్తా చాటాడు. సలార్‌ను మాస్ యాంగిల్లో చూపించి.. డార్లింగ్ అభిమానుల ఆనందానికి కారణమయ్యాడు. ఈ సినిమాను చూసి నీల్ మామకు గుడి కట్టిన తప్పులేదు అనుకున్నారు. సలార్ -2 శౌర్యాంగ పర్వం, జూనియర్ ఎన్టీఆర్‌తో మరో మూవీని ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు మరింత జోష్ పెంచాడు ప్రశాంత్ నీల్. సలార్ 2 ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రభాస్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులపై సీన్లు తెరకెక్కించాలన్న ప్లానులో ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ సినిమా పూర్తయ్యాక తారక్‌తో మూవీని పట్టాలెక్కించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కేజీఎఫ్ 3 గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేజీఎఫ్ 3 స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పాడు. సలార్ 2 షూటింగ్ ఈ నెలఖారులో మొదలు అవుతుందన్న నీల్.. కేజీఎఫ్ 3 ఉండనుందని చెప్పాడు. ఇప్పటికే స్టోరీ పూర్తయ్యిందని తెలిపాడు. సలార్ 2 పూర్తి చేశాక కాస్త బ్రేక్ తీసుకుని, కేజీఎఫ్ 3 స్టార్ట్ చేస్తామని చెప్పారు. రైటింగ్ పార్ట్ పూర్తయ్యిందని తెలిపారు. హీరో యష్, నిర్మాత విజయ్ కిరంగదూర్ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉంటే యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సారి రాఖీ భాయ్ విశ్వరూపం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే సలార్ 2 త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తుంటే.. కేజీఎఫ్ 3 అప్డేట్ అంటూ యష్ అభిమానులు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఎన్టీఆర్ 31 స్క్రిప్ట్ కూడా తుది మెరుగులు దిద్దుతున్నారట నీల్ మామ. ఇది ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సలార్ మూవీని అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేసి.. కాస్త సమయం తీసుకుని తారక్‌తో మూవీ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి పూర్తి చేసి.. రాజా సాబ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. జూన్ లేదా జులైలో సలార్ 2 షూటింగ్‌లో పాల్గొననున్నాడట డార్లింగ్. ఇది పూర్తయ్యాక స్పిరిట్ ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక తారక్ కూడా దేవర, హిందీ మూవీ వార్ 2 తో బిజీ బిజీగా ఉన్నాడు. యష్ టాక్సిక్, రామయణ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.  కల్కి జూన్ 27న విడుదల అవుతుండగా.. దేవర అక్టోబర్ 10న రిలీజ్ కు రెడీ అయ్యింది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio