iDreamPost
android-app
ios-app

జై హనుమాన్ నుంచి మరో పోస్టర్.. హాలీవుడ్ ని మించేలా ప్రశాంత్ వర్మ ప్లానింగ్..!

  • Published Apr 23, 2024 | 4:03 PM Updated Updated Apr 23, 2024 | 4:03 PM

Jai Hanuman- Prashanth Varma: ప్రశాంత్ వర్మ పేరు వింటే పాన్ ఇండియా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. హనుమ్యాన్ చూశాక అభిమానులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు జై హనుమాన్ అప్ డేట్స్ చూస్తుంటే హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతారు అనిపిస్తోంది.

Jai Hanuman- Prashanth Varma: ప్రశాంత్ వర్మ పేరు వింటే పాన్ ఇండియా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. హనుమ్యాన్ చూశాక అభిమానులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు జై హనుమాన్ అప్ డేట్స్ చూస్తుంటే హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతారు అనిపిస్తోంది.

  • Published Apr 23, 2024 | 4:03 PMUpdated Apr 23, 2024 | 4:03 PM
జై హనుమాన్ నుంచి మరో పోస్టర్.. హాలీవుడ్ ని మించేలా ప్రశాంత్ వర్మ ప్లానింగ్..!

ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ యంగ్ డైరెక్టర్ గురించే చర్చ జరుగుతోంది. సినిమా ఎలాగైనా తీయచ్చు.. కానీ, ప్రేక్షకులు వావ్ అనేలా తీయడం మాత్రం కాస్త కష్టం అనే చెప్పాలి. అంతేకాకుండా.. లిమిటెడ్ బడ్జెట్ లో థియేటర్ కి వచ్చిన ఆడియన్ ని నిరాశ పరచకుండా ఒక విజుల్ వండర్ అందించడం అంటే కాస్త సహాసం అనే చెప్పాలి. అలాంటి సవాలును ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి చూపించిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం కెరీర్ లో వెనక్కి చూసుకునే పరిస్థితి అయితే లేదు. ఒక చిన్న సినిమాగా వచ్చి హనుమ్యాన్ సాధించిన విజయం ఏంటో అందిరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అంతకు మించిన వండర్ తో రాబోతున్నాడు. జై హనుమాన్ కి సంబంధించి వస్తున్న అప్ డేట్స్ చూస్తే అలాగే ఉంది.

సాధారణంగా మీరు హనుమ్యాన్ మూవీ చూశాక వావ్ అని ఉంటారు. కానీ, జై హనుమాన్ చూస్తే ఏమనాలో కాసేపు పదాల కోసం వెతుక్కోవాలి అనేలా మూవీ ఉండబోతోందనే విషయం మాత్రం అర్థమైపోతోంది. ఎందుకంటే హనుమ్యాన్ అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి ఎంట్రీ మొత్తం జై హనుమాన్ లోనే ఉంటుంది. కాబట్టి ఆ మూవీకి వంద రెట్లు గొప్పగా తీస్తాడనే నమ్మకం అందరికీ ఉంది. తాజాగా హనుమాన్ జయంటి సందర్భంగా ప్రశాంత్ వర్మ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్ట్ చూస్తే జై హనుమాన్ మూవీపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా తక్కువనే భావన కలుగుతోంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ స్కెచ్ ఆ రేంజ్ లో ఉంది.

శ్రీరామ నవమి సందర్భంగా హనుమంతుడు.. రామయ్యకు మాటిస్తున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. అంటే రామయ్య కూడా ఈ మూవీలో ఉండే ఛాన్స్ ఉందనే సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక పెద్ద డ్రాగన్ ని చూపించారు. హనుమంతుడు నిల్చుని ఉండగా.. ఎదురుగా నిప్పులు చిమ్ముతూ ఒక డ్రాగన్ వస్తూ ఉంటుంది. ఆ షాట్ చూస్తే కాసేపు మీరు చూస్తున్నది హాలీవుడ్ మూవీ పోస్టర్ ఏమో అనిపిస్తుంది. టేకింగ్ ప్రశాంత్ వర్మ హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండానే ప్లాన్ చేస్తుంటాడు. అంతేకాదండోయ్.. మీరు జై హనుమాన్ చిత్రాన్ని 3డీలో చూడచ్చు. ఐమ్యాక్స్ త్రీడీలో చూడచ్చని అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ చేస్తున్న ప్లానింగ్ చూస్తే హాలీవుడ్ ని తలదన్నే చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు అనిపిస్తోంది. మరి.. జై హనుమాన్ కొత్త పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişanadolucasino girişgrandpashabet