iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ వర్మ ప్రభాస్ కు ఈజీ చేసేశాడు..

  • Published Sep 17, 2025 | 10:51 AM Updated Updated Sep 17, 2025 | 10:51 AM

డార్లింగ్ చేతిలో బోలెడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఏది ఎప్పుడు వస్తుంది అనేదానిమీదే ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ప్రభాస్ తో సినిమా అంటే లెక్కా పత్రాలు సరిగ్గా ఉండాలి. దాదాపు ఓ రెండేళ్ల ప్రయాణం అనుకోవచ్చు. ఈలోగానే పూర్తయింది అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే హంగులు ఆర్బాటాలు భారీ సెటప్స్ అన్ని ఉండాలి

డార్లింగ్ చేతిలో బోలెడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఏది ఎప్పుడు వస్తుంది అనేదానిమీదే ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ప్రభాస్ తో సినిమా అంటే లెక్కా పత్రాలు సరిగ్గా ఉండాలి. దాదాపు ఓ రెండేళ్ల ప్రయాణం అనుకోవచ్చు. ఈలోగానే పూర్తయింది అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే హంగులు ఆర్బాటాలు భారీ సెటప్స్ అన్ని ఉండాలి

  • Published Sep 17, 2025 | 10:51 AMUpdated Sep 17, 2025 | 10:51 AM
ప్రశాంత్ వర్మ ప్రభాస్ కు ఈజీ చేసేశాడు..

డార్లింగ్ చేతిలో బోలెడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఏది ఎప్పుడు వస్తుంది అనేదానిమీదే ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ప్రభాస్ తో సినిమా అంటే లెక్కా పత్రాలు సరిగ్గా ఉండాలి. దాదాపు ఓ రెండేళ్ల ప్రయాణం అనుకోవచ్చు. ఈలోగానే పూర్తయింది అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే హంగులు ఆర్బాటాలు భారీ సెటప్స్ అన్ని ఉండాలి. పైగా ఈ మధ్య అంతా విఎఫ్ఎక్స్ మీదే నడుస్తుంది. కాబట్టి దానికోసం ఎక్స్ట్రా టైం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభాస్ డేట్స్ దొరకపోయిన ప్రీప్రొడక్షన్ ప్లానింగ్ ను సరిగ్గా చేస్తే.. కాస్త సమయం ఆదా చేయొచ్చు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేస్తున్న పని అదే

ఆల్రెడీ ప్రశాంత్ వర్మ , ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా రణవీర్ సింగ్ చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ చేతికి చిక్కింది. దీనికి బ్రహ్మరాక్షస్ అనే వర్క్ టైటిల్ గా అనుకున్నారు. ప్రభాస్ తో సినిమా తీయబోతున్నాడు అనే అప్డేట్ ఇచ్చి.. ఇక ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సైలెంట్ అయిపోయాడు. దీనితో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ ప్రశాంత్ వర్మ ఈ గ్యాప్ లో సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసాడు. ముఖ్యంగా సినిమాకు సంబందించిన ప్రతి సీన్ ను ప్రీ విజువలైజేషన్ చేసాడట.

సో ఇక ప్రభాస్ సెట్స్ పైకి రావడమే లేట్. ప్రశాంత్ నీల్ దగ్గర ప్రతి సీన్. ప్రతి షాట్ కు సంబందించిన ప్రీ విజువలైజేషన్ స్క్రిప్ట్ పక్కాగా ఉంది. ఏ సమయంలో ఏది తీయాలి ? ఏ షాట్ ఎలా చేయాలి ? సెట్స్ దగ్గర ఎలాంటి షాట్స్ ఉంటాయి ? అవుట్ డోర్ లో ఎలాంటి సీన్స్ ప్లాన్ చేయాలి ? ఇలా ప్రతిదీ పక్కాగా రెడీ చేసాడు. సో దీని వలన షూటింగ్ సమయంలో పనులు ఈజీగా సాగిపోతాయి. ఇక ఆ తర్వాత ఎడిటింగ్ లాంటివి కాస్త సమయం తీసుకున్న ఇబ్బంది ఉండదు. మొత్తానికి ప్రశాంత్ వర్మ సినిమాను ఈజీ చేసేసాడు. ఈ ఏడాది చివరిలో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.