iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: ప్రీ బుకింగ్స్‌లో గుంటూరు కారం రికార్డు! ఇది మహేశ్ రేంజ్!

గుంటూరు కారం సినిమా ఫస్ట్‌ డేకు భారీ సంఖ్యలో షోలు పడనున్నాయి. మల్టీప్లెక్స్‌లు పోటాపోటీగా షోలు వేస్తున్నాయి. ప్రసాద్‌ ఐమాక్స్‌, ఏఎంబీ సినిమాస్‌ పోటీ పడుతున్నాయి.

గుంటూరు కారం సినిమా ఫస్ట్‌ డేకు భారీ సంఖ్యలో షోలు పడనున్నాయి. మల్టీప్లెక్స్‌లు పోటాపోటీగా షోలు వేస్తున్నాయి. ప్రసాద్‌ ఐమాక్స్‌, ఏఎంబీ సినిమాస్‌ పోటీ పడుతున్నాయి.

Guntur Kaaram: ప్రీ బుకింగ్స్‌లో గుంటూరు కారం రికార్డు! ఇది మహేశ్ రేంజ్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసాద్‌ ఐమాక్స్‌ గురించి తెలియని సినీ ప్రియుడు ఉండటంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసాద్‌ ఐమాక్స్‌కు మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో సినిమాలకు వెళ్లే వారికి ప్రసాద్‌ ఫస్ట్‌ ఆప్చన్‌గా నిలుస్తోంది. సామాన్య సినీ ప్రేక్షకులే కాదు.. సెలెబ్రిటీలు కూడా ప్రసాద్‌నే తమ మొదటి ఎంపికగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మహేష్‌ బాబు సొంత థియేటర్‌ ఏఎంబీ ప్రసాద్‌కు పోటీగా మారిపోయింది. సెలెబ్రిటీల ఫేవరేట్‌ మూవీ అడ్డాగా తయారైంది.

సినిమాటిక్‌ పవర్‌ హౌస్‌లాగా తయారైంది. అయినప్పటికీ ప్రసాద్‌ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. రెండూ పోటాపోటీగా సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. మహేష్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, విడుదల రోజు రాత్రి 1 గంటకు స్పెషల్‌ షోలు పడనున్నాయి.

నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న దిల్‌ రాజు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పెషల్‌ షోలు వేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో కలిపి మొత్తం 23 థియేటర్లలో స్పెషల్‌ షోలు పడనున్నాయి. ఈ థియేటర్ల లిస్టులో ప్రసాద్‌ ఐమాక్స్‌, ఏఎంబీ సినిమాస్‌ కూడా ఉన్నాయి. గుంటూరు కారం సినిమా స్పెషల్‌ షోల విషయంలో రెండు సినిమాల మధ్య పోటీ నడుస్తోంది. సినిమా విడుదల రోజు ప్రసాద్‌ ఐమాక్స్‌లో మొత్తం 41 షోలు పడనున్నాయి. ఏఎంబీ విషయానికి వస్తే.. మొదటి రోజు ప్రసాద్‌ ఐమాక్స్‌ కంటే ఓ షో ఎక్కువగానే పడనుంది. ఏఎంబీలో మొత్తం 42 షోలు పడనున్నాయి.

ప్రీ బుకింగ్స్‌ విషయంలో గుంటూరు కారం రికార్డు సృష్టిస్తోంది. టికెట్లకు భారీ డిమాండ్‌ నడుస్తోంది. కాగా, గుంటూరు కారం సినిమాలో కాగా, గుంటూరు కారంలో మహేష్‌ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందించారు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమా తెరకెక్కింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో మూవీ తెరకెక్కింది. మరి, ఫస్ట్‌ డే షోల విషయంలో ప్రసాద్‌ ఐమాక్స్‌, ఏఎంబీ సినిమాస్‌ మధ్య నడుస్తున్న పోటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.