iDreamPost
android-app
ios-app

కులం పేరు చెప్పి సినిమా నుంచి తీసేశారు.. ప్రసాద్ బెహరా ఎమోషనల్

  • Published May 23, 2024 | 9:30 PM Updated Updated May 23, 2024 | 9:30 PM

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే అంతా ఈజీ కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో అవమానాలను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రసాద్ బెహరా అనే నటుడు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే అంతా ఈజీ కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో అవమానాలను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రసాద్ బెహరా అనే నటుడు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

  • Published May 23, 2024 | 9:30 PMUpdated May 23, 2024 | 9:30 PM
కులం పేరు చెప్పి సినిమా నుంచి తీసేశారు.. ప్రసాద్ బెహరా ఎమోషనల్

సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిరూపించుకోవాలని ఎంతో మంది యూత్ కలలు కంటుంటారు. ఆర్టిస్టుగా, డైరెక్టర్ గా, హీరోగా రాణించాలని తాపత్రయ పడుతుంటారు. సినీ అవకాశాలు దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవకాశాలేమో గాని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశాలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడడం, లేదా కులం పేరుతో అవకాశాలు ఇవ్వకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇదే రీతిలో ఓ నటుడు అవమానాలకు గురయ్యాడు. ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా కులం కారణంగా అకాశం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేశారు.

ప్రసాద్ బెహరా షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆయన సినీ అవకాశాలను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం నిహారిక నిర్మిస్తున్న కమిటీ కుర్రాళ్లు అనే సినిమాల్లో నటిస్తున్నాడు ప్రసాద్ బెహరా. కాగా గతంలో ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఓ పెద్ద సినిమాకు డైరెక్టర్ గా అవకాశం వచ్చినప్పటికీ కులం కారణంగా ఛాన్స్ ఇవ్వలేదని తెలిపారు. గతంలో పాల్గొన్న ఓ ఇంటర్య్వూలో ప్రసాద్ బెహరా ఈ విషయాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ప్రసాద్ బెహరా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లో తనకు డైరెక్టర్ గా అవకాశం వచ్చిందని తెలిపారు. ప్రొడక్షన్ ఆఫీస్ కు వెళ్తే డైరెక్టర్ గా ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి పిలిచినట్టుగా చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత సరే ఓకే నాయుడుగారు అని అన్నారు. నేను కాదండీ అన్నాను. అలాగే రెడ్డిగారు అన్నారు .. కాదు అన్నాను. చౌదరిగారు అన్నారు.. నేను కాదు అన్నాను. దీంతో అతనికి విషయం తెలిసిపోయింది. అడ్వాన్స్ తీసుకునేందుకు రేపు రావాలని చెప్పి పంపించినట్లు తెలిపాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి తనకు కబురు రాలేదని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందని ప్రసాద్ బెహరా తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Kamadri (@kamadri_tales)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş