iDreamPost
android-app
ios-app

భర్తకు ప్రణీత పాదపూజ.. ట్రోలర్స్ గట్టిగానే ఇచ్చి పడేసింది!

భర్తకు ప్రణీత పాదపూజ.. ట్రోలర్స్ గట్టిగానే ఇచ్చి పడేసింది!

ప్రణీత సుభాష్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద పెద్ద కళ్లు, చక్కని నవ్వు, అందం, అభినయంతో కుర్రకారుకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఆమెకు సరైన స్టార్ డమ్, హోదా అయితే రాలేదనే చెప్పాలి. ఎంత టాలెంట్ ఉన్నా.. స్టార్ హీరోయిన్ అనే బిరుదు సొంతం చేసుకోలేక పోయింది. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో అయితే ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేస్తోంది.

పెళ్లి తర్వాత సినిమాలకు, వెండితెరకు దూరంగా ఉన్నా కూడా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తన వ్యక్తిగత, డైలీ రొటీన్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా స్పెషల్ డేస్ లో పిక్స్ ని అప్ లోడ్ చేస్తుంటుంది. అలాగే తాజాగా తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫొటోని షేర్ చేసింది. భీమన అమావాస్య సందర్భంగా తన భర్త కాళ్లకు పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంది. అదే విషయాన్ని తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

ఆమె గతంలో కూడా ఇలాగే తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫొటోని షేర్ చేసింది. అప్పుడు మీమర్స్, కొందరు నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా భర్త కాళ్లకు పూజలు చేస్తున్నారా? ఒక సెలబ్రిటీ అయిన మీరు ఇలా చేయడం ఏంటి? అంటూ ఆమెకు ప్రశ్నలు సంధించారు. అయితే ఈసారి ప్రణీత తన భర్తకు పాదపూజ చేసి పిక్ పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా.. గతంలో ఇలా ట్రోల్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చింది. మరొకసారి అలాంటి ట్రోల్స్ చేయాలంటే కంగారు పడేలా ఇచ్చి పడేసింది.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

“భీమన అమావాస్య సందర్భంగా ఉందయం పూజ చేశాను. ఎవరైతే దీనిని తప్పుబడతారో.. పితృస్వామ్య ఆధిపత్యంగా ఫీలవుతారో వారికి చెబుతున్నాను. సనాతన ధర్మంలో ప్రతి క్రతువుకు ఒక ప్రాముఖ్యత, అంతరార్థం ఉంటాయి. హిందూ పూజా విధానాలు అన్నీ పురుషాధిక్యంగా ఉంటాయని వాదించడం అర్థరహితం. ఎందుకంటే అదే ధర్మంలో దేవతలను కూడా సమానంగా పూజిస్తారు” అంటూ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ రిప్లయి ఇచ్చేసింది. ప్రస్తుతం ప్రణీత సుభాష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. నెటిజన్స్ కూడా ప్రణీత పోస్టుపై స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ అంతూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. మేము నీ అభిమానులం అయినందుకు గర్వపడుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటూ కూడా సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారని, కలియుగ సీతమ్మ మీరు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రణీతను చూసి చాలా మంది నేర్చుకోవాలంటూ అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş