iDreamPost
android-app
ios-app

ప్రణీత్ హనుమంతు ఘటన పై స్పందించిన Aye jude అజయ్. సొంత తమ్ముడైనా సరే!

  • Published Jul 11, 2024 | 10:22 AM Updated Updated Jul 11, 2024 | 10:48 AM

Aye Jude: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది లైకులు, షేర్ల కోసం ఇష్టాను సారంగా వీడియోలు, రీల్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తండ్రీ కూతురుపై చేసిన ఓ వీడియోపై వల్గర్ కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Aye Jude: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది లైకులు, షేర్ల కోసం ఇష్టాను సారంగా వీడియోలు, రీల్స్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. తండ్రీ కూతురుపై చేసిన ఓ వీడియోపై వల్గర్ కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

  • Published Jul 11, 2024 | 10:22 AMUpdated Jul 11, 2024 | 10:48 AM
ప్రణీత్ హనుమంతు ఘటన పై స్పందించిన  Aye jude అజయ్. సొంత తమ్ముడైనా సరే!

తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతు గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ మధ్య తండ్రీ కూతురు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దానిపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మరికొంతమందితో వ్యంగ్యంగా మాట్లాడటమే కాదు.. తండ్రి కూతురు బందానికే మచ్చ తెచ్చే విధంగా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. ఈ విషయంపై నటుడు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే ప్రణీత్ హనుమంతుని బెంగుళూరులో అరెస్ట్ చేశారు. హనుమంతు అరెస్ట్ పై ఆయన సోదరుడు షాకింగ్ పోస్ట్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో తండ్రీ కూతురు బంధంపై అసభ్యంగా కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుని మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ తో అతని పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగింది. ఆ వీడియోలో మరికొంత మందితో ప్రణీత్ చేసిన వ్యాఖ్యలు చూసి నెటిజన్లు కోపంతో ఊగిపోయారు.చిన్న పిల్లలపై అసభ్యంగా కామెంట్స్ చేసిన ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రెటీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఆయన సోదరుడు ప్రముఖ యూట్యూబర్ అజయ్ హనుమంతు(Aye Jude) స్పందించారు.

అజయ్ హనుమంతు(Aye Jude) మాట్లాడుతూ.. ‘ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది వల్గర్ కామెంట్స్ చేస్తూ అదేదో గొప్పగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సమయంలో నా పెళ్లి గురించి చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. నాకు పెళ్లై ఇప్పటికీ ఆరేళ్లయ్యింది.. ఇంజనీరింగ్ పూర్తి కాగానే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను ఐఏఎస్ ఆఫీసర్ కొడుకునైనా రోడ్డు మీదే నా లైఫ్ మొదలైంది. అడల్ట్ అండ్ కామెడీని పర్సనల్ గా నేను అస్సలు ఎంకరేజ్ చేయను. అలాంటివి చూడను.. అలాంటి పనులు ఎవరు చేసినా తప్పే. తప్పు ఎవరు చేసినా తప్పే.. అది నా తమ్ముడు అయినా శిక్ష పడాల్సిందే అన్నారు.  ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet