iDreamPost
android-app
ios-app

అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న డార్లింగ్ పెళ్లి కబురు వచ్చేస్తోందోచ్…!

  • Published Oct 09, 2024 | 6:04 PM Updated Updated Oct 09, 2024 | 6:04 PM

డార్లింగ్ ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. మరీ మ్యారేజ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడు? ఇదే అందర్ని మెలిపెడుతోన్న ప్రశ్న. అయితే ఫ్యాన్స్ బీ రెడీ.. మీకోసమే త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందట

డార్లింగ్ ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. మరీ మ్యారేజ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడు? ఇదే అందర్ని మెలిపెడుతోన్న ప్రశ్న. అయితే ఫ్యాన్స్ బీ రెడీ.. మీకోసమే త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందట

  • Published Oct 09, 2024 | 6:04 PMUpdated Oct 09, 2024 | 6:04 PM
అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న డార్లింగ్ పెళ్లి కబురు వచ్చేస్తోందోచ్…!

ఇండస్ట్రీలో ఏదైనా ఇంట్రస్ట్ అండ్ క్రేజీ న్యూస్ ఉందంటే.. అది ప్రభాస్ పెళ్లి టాపిక్కే. యంగ్ హీరోలంతా మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టి పిల్ల, పాపలతో హ్యాపీగా ఉంటున్నారు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. సినిమాలతో కాలక్షేపం చేస్తూ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.. పెళ్లి పీటలెక్కుతాడని అనుకున్నారంతా. కానీ లేడీ ఫ్యాన్స్ హర్ట్ చేయకుండా పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తున్నాడు డార్లింగ్. కల్కి సమయంలో కూడా లేడీ డై హార్డ్ ఫ్యాన్స్ బాధపడతారనే మ్యారేజ్ చేసుకోవడం లేదంటూ.. ఫన్నీగా స్పందించాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఓ ఇంటి వాడు అయితే చూడాలనుకుంటున్నారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆచితూచి ఆలోచిస్తున్న ప్రభాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట.

ఈ విషయాన్ని స్వయంగా డార్లింగ్ పెద్దమ్మ శ్యామలా దేవి చెప్పారు. ఇటీవల విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన శ్యామలా దేవి.. మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సమయంలో ఆమెకు ప్రభాస్ పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. పెళ్లిపై నెలకొన్న ట్విస్ట్‌కు ఫుల్ స్టాప్‌ పెట్టేశారు కృష్ణంరాజు సతీమణి. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అమ్మాయి, ఇతర వివరాలు ఏమీ పంచుకోలేదు. కానీ.. యంగ్ రెబల్ స్టార్.. పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియగానే ఫుల్ ఖుషీలో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న అభిమానుల నోట్లో చక్కెర పోశారు ప్రభాస్ పెద్దమ్మ. పెద్దమ్మే స్వయంగా ప్రభా.. వివాహం జరుగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ కింగ్ పక్కన రాబోయే క్వీన్ ఎవరన్నది ఆసక్తి నెలకొంది.

త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కండిషన్స్ అప్లైలాగా ఏమైనా అడ్డంకులు వస్తాయోమోనన్న ఆందోళన చెందుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. చూడాలి మరీ ప్రభాస్ ఈసారి పెళ్లి విషయంలో డేర్ స్టెప్ వేస్తాడేమో. ఇక డార్లింగ్ కెరీర్ విషయానికి వస్తే.. కళ్లు చెదిరే లైనప్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సలార్, కల్కి2898 ఏడీతో అభిమానులను ఫుల్ శాడిస్ఫై చేసిన ఈ బాక్సాఫీస్ కింగ్.. మారుతి డైరెక్షన్ లో హారర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ రాజా సాబ్ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను పట్టాలెక్కించాడు. ఇవే కాకుండా మరో త్రీ క్రేజీ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నాయి. డేరింగ్ అండ్  డ్యాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే సలార్ 2, కల్కి 2 అల్రెడీ కర్చీఫ్ వేసిన సినిమాలివి. అంతేనా.. గెస్ట్ రోల్ కన్నప్ప కూడా ఈ లైన్లోనే ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోపు.. మరిన్ని ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  మరీ పెళ్లిపై గురుడు ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. ప్రభాస్ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom