iDreamPost
android-app
ios-app

ప్రభాస్ రాజాసాబ్ మూవీ గ్లింప్స్ ఎలా ఉందంటే?

  • Published Jul 29, 2024 | 5:11 PM Updated Updated Jul 29, 2024 | 5:11 PM

Prabhas The Rajasaab Movie Glimpse Review In telugu: ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తాజా గ్లింప్స్ తో రెట్టింపు చేశారు. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత కచ్చితంగా మూవీ కోసం అభిమానుల ఎదురుచూపులు స్టార్ట్ అవుతాయి.

Prabhas The Rajasaab Movie Glimpse Review In telugu: ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తాజా గ్లింప్స్ తో రెట్టింపు చేశారు. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత కచ్చితంగా మూవీ కోసం అభిమానుల ఎదురుచూపులు స్టార్ట్ అవుతాయి.

  • Published Jul 29, 2024 | 5:11 PMUpdated Jul 29, 2024 | 5:11 PM
ప్రభాస్ రాజాసాబ్ మూవీ గ్లింప్స్ ఎలా ఉందంటే?

ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చిన్నగా కల్కి 2898 ఏడీ మూవీ మేనియా నుంచి బయటకు వస్తున్నారు. కాదు.. కాదు.. ది రాజాసాబ్ మూవీ టీమ్ బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ మూడ్ ని రాజాసాబ్ మూవీపైకి మళ్లించారు. డైరెక్టర్ మారుతీ- ప్రభాస్ కాంబోలో ది రాజాసాబ్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇప్పుడు వాటిని డబుల్, త్రిబుల్ చేస్తూ రాజాసాబ్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ని చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అప్పుడే సినిమా కోసం ఎదురుచూపులు కూడా ప్రారంభించేశారు. అసలు ఆ గ్లింప్స్ ఎలా ఉందంటే?

డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసిందే. ఆయన నవ్వించగలడు, ఆలోచింపజేయగలడు, భయపెట్టగలడు కూడా. ఆయనలో ఉన్న ఆ అన్ని క్వాలిటీలను ఏకం చేసి ఈ రాజాసాబ్ గ్లింప్స్ ని తీసుకొచ్చారు అనే భావన కలుగుతుంది. ఈ గ్లింప్స్ తో అసలు మూవీ ఎలా ఉండబోతోంది అనే క్లారిటీ అయితే ఇచ్చేశారు. అలాగే మూవీ నుంచి అభిమానులు ఎలాంటి అవుట్ పుట్ ని ఎక్స్ పెక్ట్ చేయచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు సినిమా అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేస్తారు. సలార్, కల్కిలో చూసిన ప్రభాస్.. రాజాసాబ్ లో చూసిన ప్రభాస్ కు చాలా వేరియేషన్ ఉంటుంది.

ఈ మూవీలో మొదట లుంగీతో ఉన్న ఫస్ట్ లుక్ వదిలారు. ఇప్పుడు ఫుల్ ఆపోజిట్ లో మంచి సూటు బూటు వేశారు. అలాగే ఇది ఒక మంచి హారర్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. మొత్తానికి రాజాసాబ్ తో మారుతి గట్టిగానే ప్లాన్ చేశాడు అని అర్థమైపోతోంది. అలాగే క్యారెక్టర్ లో కచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ని బట్టి చూస్తే అటు మాసు.. ఇటు క్లాసు.. రెండు కేటగిరీలను మెప్పించే ఒక మంచి రొమాంటిక్.. హారర్ థ్రిల్లర్ లోడింగ్ అనమాట. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా 2025, ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి.. రాజాసాబ్ గ్లింప్స్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique