iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కంప్లీట్ ఫోకస్ ఆ సినిమా మీదే ఉంది.. ఫ్యాన్స్ కు పండగే

  • Published Oct 05, 2024 | 2:46 PM Updated Updated Oct 05, 2024 | 2:46 PM

The Raja Saab Movie Updates :ప్రభాస్ వరుస లైన్ అప్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు యాక్షన్ ఎలిమెంట్స్ అభిమానులకు కిక్ ఇచ్చిన తారక్.. ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు . రాజా సాబ్ షూటింగ్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

The Raja Saab Movie Updates :ప్రభాస్ వరుస లైన్ అప్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు యాక్షన్ ఎలిమెంట్స్ అభిమానులకు కిక్ ఇచ్చిన తారక్.. ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు . రాజా సాబ్ షూటింగ్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 05, 2024 | 2:46 PMUpdated Oct 05, 2024 | 2:46 PM
ప్రభాస్ కంప్లీట్ ఫోకస్ ఆ సినిమా మీదే ఉంది.. ఫ్యాన్స్ కు పండగే

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఇక కల్కి తర్వాత ఇంకో మెట్టు ఎదిగింది. ఈ సినిమాతో వసూళ్ల విషయంలో కొత్త టార్గెట్ ఫిక్స్ చేసి.. అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఒక్కో మూవీతో హిట్ కొడుతూ బాక్స్ ఆఫీస్ ను వణికిస్తున్నాడు. ఇక రాబోయే రాజాసాబ్ , స్పిరిట్ సినిమాలతో ఈ క్రేజ్ ఇంకాస్త ఊపు అందుకుంటుంది. ఫ్యాన్స్ నందు ప్రభాస్ ఫ్యాన్స్ వేరయా అనేలా.. ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ కు సంబంధించి.. ఏ అప్డేట్ వచ్చిన ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు అభిమానులు. అటు డార్లింగ్ కూడా ఫ్యాన్స్ కు మంచి కంటెంట్ అందించడానికి వరుస లైన్ అప్స్ తో బిజీ అయ్యాడు. వీటిలో ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా కూడా ది రాజా సాబ్ సినిమా మీదే ఉంది. ఇప్పటి వరకు యాక్షన్ ఎలిమెంట్స్ తో కిక్ ఇచ్చిన ప్రభాస్ .. ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

అదిరి పోయే ఎంటర్టైన్మెంట్ , కావాల్సినంత కామెడీ , ప్రభాస్ రొమాంటిక్ లుక్స్ , లవ్ యాంగిల్ అబ్బో ఒకటా రెండా.. వింటేజ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కోరుకునే ఎలిమెంట్స్ అన్ని దీనిలోనే ఉన్నాయి. అదే మారుతి- ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ మూవీ. దాదాపు సంవత్సరం పై నుంచి ఈ మూవీ సెట్స్ పైనే ఉంది. కానీ ,ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా కొనసాగుతుంది. డార్లింగ్ కూడా ఈ సినిమాపై కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. ది రాజా సాబ్ సినిమాను ఏప్రిల్ 10 న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మేకర్స్ చెప్పిన రిలీజ్ డేట్ కు ఇంకా కొద్దీ నెలల సమయం మాత్రమే ఉంది. దీనితో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. సో నవంబర్ నాటికి మూవీ షూటింగ్ ఫినిష్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. జనవరి నుంచి వరుస అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 80% షూట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. అలాగే పార్లల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు టాక్.

చూడబోతుంటే, వీలైనంత త్వరగా రాజాసాబ్  ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది. అసలే ఇప్పటివరకు ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ హర్రర్ రొమాంటిక్ కామెడీ ఫ్యాన్స్ కు కాస్త రిలీఫ్ గా ఉండబోతుంది. మేకర్స్ ఎంత స్పీడ్ గా ఉన్నారో.. అభిమానులు కూడా అంతే ఎక్సయిటెడ్ గా ఉన్నారు. మరి రాజా సాబ్ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి. ఇక ఆ తర్వాత కూడా గ్యాప్ లేకుండా ప్రభాస్ లైన్ అప్స్ రెడీగా ఉన్నాయి. కల్కి-2 , సలార్-2 , ఫౌజీ , స్పిరిట్ సినిమాలతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ వడ్డించడానికి డార్లింగ్ రెడీగా ఉన్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ మూవీస్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. అవి మూవీస్ పై ఎలాంటి అంచనాలను పెంచుతాయో వేచి చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio