iDreamPost
android-app
ios-app

సెట్స్ లో అడుగు పెట్టిన రాజాసాబ్ హీరోయిన్.. సెలబ్రేషన్ ఫొటోలు వైరల్..

  • Published Aug 04, 2024 | 1:41 PM Updated Updated Aug 04, 2024 | 1:41 PM

Prabhas The Raja Saab Movie Heroine Malavika Mohanan Birthday Celebrations: మారుతి- డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ది రాజా సాబ్ మూవీ సెట్స్ నుంచి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ బర్త్ డేని సెట్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

Prabhas The Raja Saab Movie Heroine Malavika Mohanan Birthday Celebrations: మారుతి- డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ది రాజా సాబ్ మూవీ సెట్స్ నుంచి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ బర్త్ డేని సెట్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

  • Published Aug 04, 2024 | 1:41 PMUpdated Aug 04, 2024 | 1:41 PM
సెట్స్ లో అడుగు పెట్టిన రాజాసాబ్ హీరోయిన్.. సెలబ్రేషన్ ఫొటోలు వైరల్..

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈయన సినిమాల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఏడాదికి రెండు సినిమాలు తీస్తాను అని గతంలో స్టేజ్ మీద చెప్పిన ప్రభాస్.. దానికి తగినట్లుగానే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా శరవేగంగా పనులు జరుపుకుంటున్న మూవీ ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీకి సంబంధించి ఇటీవలే గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ హీరోయిన్ సెట్స్ లో అడుగుపెట్టడమే కాకుండా.. కేక్ కోసి సెలబ్రేట్ కూడా చేసుకుంది. ఆ ఫొటోలను మూవీ టీమ్ అభిమానులతో పంచుకుంది.

‘ది రాజా సాబ్’ మూవీలో డార్లింగ్ ప్రభాస్ సరసన మాలవిక మోహనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇటీవల ఆమె పిక్స్ కొన్ని లీక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా మూవీ టీమ్ మాళవిక మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ని విడుదల చేశారు. మాళవిక మోహనన్ కేక్ కట్ చేస్తున్న పిక్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. మాళవిక మోహనన్ రాజా సాబ్ సెట్స్ లో అడుగుపెట్టారు. ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ మారుతీతో కలిసి మాళవిక మోహనన్ సెల్ఫీ తీసుకుంటున్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

ఇంక రాజా సాబ్ మూవీకి సంబంధించి అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అని ప్రశ్నలు స్టార్ట్ చేశారు. నెట్టింట చిన్నగా డిమాండ్లు కూడా మొదలు పెడుతున్నారు. అయితే ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పుడల్లా ఫస్ట్ సింగిల్ ఉండే అవకాశం లేదు అంటున్నారు. ఈ విషయంపై తమన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చే జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. అంటే మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనే విషయాన్ని గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే వెల్లడించారు. కాబట్టి రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రావాలి అంటే ఇంకో 4 నెలలు అయినా వెయిట్ చేయకతప్పదు. మరి.. డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే సందర్భంగా.. మీరు కూడా కామెంట్స్ రూపంలో మీ విషెస్ ని తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom