iDreamPost
android-app
ios-app

సీనియర్ నటితో అఫైర్.. ప్రభాస్ శ్రీను రియాక్షన్ ఇదే!

  • Author Dharani Published - 04:21 PM, Tue - 13 June 23
  • Author Dharani Published - 04:21 PM, Tue - 13 June 23
సీనియర్ నటితో అఫైర్.. ప్రభాస్ శ్రీను రియాక్షన్ ఇదే!

యాక్టర్ శ్రీను అంటే టక్కున గుర్తుపట్టడం కష్టం కానీ.. ప్రభాస్ శ్రీను అనగానే వెంటనే గుర్తు పడతారు. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీ లో రాణిస్తున్నాడు ప్రభాస్ శ్రీను. కమెడియన్, విలన్, సహాయ నటుడిగా విభిన్న పాత్రల్లో నటిస్తూ.. ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్ శ్రీను. తన కెరీర్ లో ఇప్పటి వరకు 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు. నటుడిగా కంటే ప్రభాస్ మిత్రుడిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో తనకు అన్ని ప్రభాసే అని.. ఏదైనా విషయం తనతోనే ముందుగానే చెబుతానని ఇప్పటికి అనేక సార్లు చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ప్రభాస్ శ్రీను కి సంబంధించి కొన్ని పుకార్లు తెగ హల్చల్ చేస్తున్నాయ్. అవి ఏంటి అంటే ఆయనకు, సీనియర్ నటి తులసికి మధ్య అఫైర్ ఉందంటూ జోరుగా వార్తలు అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ వార్తల పై స్పందించాడు ప్రభాస్ శ్రీను. నటి తులసి.. శ్రీనుని ఉద్దేశించి డార్లింగ్ అని పిలవడంతో ఈ పుకార్లు తెర మీదకు వచ్చాయి. ఈ వార్తలపై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీను ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్బంగా శ్రీను మాటాడుతూ.. “తులసిగారితో నేను ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. కానీ మా మీద చాలా వార్త పత్రికలు రూమర్స్ రాశాయి. ఆవిడ నాకు తల్లితో సమానం. డార్లింగ్ సినిమా సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి.. ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని.. చాలా అపార్థం చేసుకున్నారు. మాపై రూమర్స్ వచ్చినప్పుడు మొదట ఆవిడే నాకు వాటి గురించి మెసేజ్ చేశారు. మన గురించి ఇలా రాశారు అని చెప్పారు. అంతేకాక ముందు ఈ వార్తల గురించి మీ భార్యకు చెప్పు. లేదంటే తను కూడా అపార్థం చేసుకుంటుందేమోనని అన్నారు. నా భార్య డాక్టర్. ఆ రూమర్స్ చూసి ఇద్దరం నవ్వుకుని వదిలేశాం. తులసి గారంటే నాకు చాలా గౌరవం. ఆవిడ ఎప్పుడూ పూజలకు సబంధించిన మెసేజ్ లే పెడుతుంటారు ” అంటూ చెప్పుకొచ్చారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet