iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో ప్రభాస్‌ నన్ను మందలించాడు: ప్రభాస్‌ శీను

  • Published Nov 17, 2023 | 10:13 AM Updated Updated Nov 17, 2023 | 10:13 AM

ప్రభాస్‌తో ఎంతో క్లోజ్‌గా ఉండే ప్రభాస్‌ శీను గత కొన్నేళ్ల నుంచి ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రభాస్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తోందో ప్రభాస్‌ శీను క్లారిటీ ఇచ్చారు...

ప్రభాస్‌తో ఎంతో క్లోజ్‌గా ఉండే ప్రభాస్‌ శీను గత కొన్నేళ్ల నుంచి ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రభాస్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తోందో ప్రభాస్‌ శీను క్లారిటీ ఇచ్చారు...

  • Published Nov 17, 2023 | 10:13 AMUpdated Nov 17, 2023 | 10:13 AM
ఆ విషయంలో ప్రభాస్‌ నన్ను మందలించాడు: ప్రభాస్‌ శీను

ప్యాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్రముఖ టాలీవుడ్‌ నటుడు ‘ప్రభాస్‌ శీను’ల మధ్య మంచి స్నేహం  ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. కొన్నేళ్ల క్రితం వరకు దాదాపు ప్రభాస్‌ నటించే ప్రతీ సినిమాలో ప్రభాస్‌ శీను కనిపిస్తూ వచ్చారు. ప్రముఖ స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ప్రభాస్‌ స్టార్‌ హీరో అయినా వీరి ఫ్రెండ్షిప్‌లో ఎలాంటి మార్పు రాలేదు.

అయితే, గత కొన్ని ఏళ్ల నుంచి ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. ఈ దూరానికి కారణంగా ఇద్దరి మధ్యా గొడవలు రావటమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ప్రభాస్‌ శీను తాజాగా స్పందించారు. సినిమాల్లో బిజీగా ఉండటం కారణంగానే ప్రభాస్‌ ఉండలేకపోతున్నానని అన్నారు. ప్రభాస్‌ శీను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ ఆయన సలహా ఇవ్వరు. నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే.. భయంతో పని చేస్తావు. భయంతో కాదు ఇష్టంతో పని చేయాలి. ప్రేమతో పని చేయాలి. ఎక్కువ టైం ఇస్తారు. రియలైజేషన్‌కు ఎక్కువ టైం ఇస్తారు. ఆయన చాలా టైం తీసుకుంటారు. పేషన్స్‌ ఎక్కువ.

వాడికి ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడి అంతట వాడే పని చేస్తాడు అంటారు. నేను ఇలా ఉండాలి అంటే యాక్ట్‌ చేస్తాడు. అది ఆయనకు నచ్చదు. అలాంటివి ఆయన దగ్గరలో కూడా తీసుకోలేడు. మనకు కూడా ఆయన టెండెన్సీ తెలుసు.. మూడ్‌ తెలుసు కాబట్టి.. ఇది ఆయనకు నచ్చట్లేదు. సో అలవాటు మార్చుకోవాలి. సో.. ఈ విధంగా ఆయనకు ఇచ్చేయాలి అని తెలుసుకున్నపుడు ఇరు వైపుల నుంచి సమస్య ఉండదు. ప్రభాస్‌తో నేను అంత క్లోజ్‌గా ఉండటం కొంతమందికి నచ్చలేదు. బాగా పెళ్లాంతో క్లోజ్‌ అయితే అమ్మే ఒప్పకోదు.. పెంచి పెద్ద చేస్తే.. తల్లినే మర్చిపోయాడు అంటుంది. అది కామన్‌ థింగ్‌.. అవన్నీ పట్టించుకునే స్టేజి నాది కాదు.

నాది, ప్రభాస్‌ది ఫెయిర్‌ రిలేషన్‌.. కాంట్రాక్ట్‌ బేస్డ్‌ కాదు. గంగానది లాగా వెళ్లిపోవటం తప్ప.. ఎలాంటి కండీషన్స్‌ లేవు. ఎప్పటికీ లేవు.. ఎప్పటికీ రావు. నేను ఆయన్ని వదులుకోలేదు… నేను షూటింగుల్లో ఎక్కడో వైజాగ్‌లో ఉంటాను. సినిమాల్లో బిజీగా ఉండటం కారణంగా నేను ఆయనకు దూరంగా ఉన్నాను. ఆయనకు చెబితే.. ‘‘ సినిమాల్లో నటుడు అవ్వాలని వచ్చావు కాదా.. వెళ్లు’ అని అన్నారు. ఆయన దగ్గర ఉన్నపుడు చాలా సినిమా అవకాశాలు కోల్పోయాను. తాగుడు, పేకాటలాంటి విషయాలు మానుకోమని ఆయన నాకు సలహా ఇచ్చారు’’ అని అన్నారు. మరి, ప్రభాస్‌తో గొడవలపై ప్రభాస్‌ శీను క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş