iDreamPost
android-app
ios-app

సందీప్ టార్గెట్ ఫిక్స్.. అనుకున్నదానికంటే ముందుగానే స్పిరిట్..!

  • Published Nov 12, 2024 | 2:55 PM Updated Updated Nov 12, 2024 | 2:55 PM

Spirit Movie Updates: ప్రస్తుతం సందీప్ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు.. హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందన్న విషయం ఆల్రెడీ తెలిసిందే. దీనికి సంబంధిచిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమా నుంచి వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే. స్పిరిట్ సినిమాను అనుకున్నదానికంటే ముందే కంప్లీట్ చేయనున్నాడట సందీప్.

Spirit Movie Updates: ప్రస్తుతం సందీప్ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు.. హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందన్న విషయం ఆల్రెడీ తెలిసిందే. దీనికి సంబంధిచిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమా నుంచి వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే. స్పిరిట్ సినిమాను అనుకున్నదానికంటే ముందే కంప్లీట్ చేయనున్నాడట సందీప్.

  • Published Nov 12, 2024 | 2:55 PMUpdated Nov 12, 2024 | 2:55 PM
సందీప్ టార్గెట్ ఫిక్స్.. అనుకున్నదానికంటే ముందుగానే స్పిరిట్..!

ఓ బడా డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో కాంబినేషన్ అంటే.. అది రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు. ఇక ప్రభాస్ లాంటి హీరో ఉంటే ఇంకాస్త ఆలస్యం అవుతుందని అనుకుంటారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ మారాడు. ప్రభాస్ స్పీడ్ ను ఎవరు మ్యాచ్ చేయలేకపోతున్నారు. రెండు సినిమాలు ఒకేసారి చేస్తుండగానే.. మరో సినిమా సెట్స్ పైకి.. ఇంకొన్ని సినిమాలు చేతిలోకి. ఇలా ప్రభాస్ అసలు తీరిక లేకుండా బిజీ బిజీ అవుతున్నాడు.  కనీసం ఏడాదికి రెండు సినిమాలైనా తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు డార్లింగ్. ఇప్పుడు ప్రభాస్ సినిమాలలో ముఖ్యంగా వినిపిస్తున్న మూవీ స్పిరిట్. కారణం దాని వెనుక సందీప్ రెడ్డి వంగ ఉండడమే. ఈ దర్శకుడు తీసింది మూడు సినిమాలే అయినా.. ఇతని బ్రాండ్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. టి సిరీస్ సంస్థ పట్టువదలకుండా సందీప్ ను నమ్మి.. వందల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. దీన్ని బట్టే సందీప్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు.. హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందన్న విషయం ఆల్రెడీ తెలిసిందే. దీనికి సంబంధిచిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమా నుంచి వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే. స్పిరిట్ సినిమాను అనుకున్నదానికంటే ముందే కంప్లీట్ చేయనున్నాడట సందీప్. వీలైనంత వరకు ఈ సినిమా కోసం ఆరు నెలల టార్గెట్ ను పెట్టుకున్నారట. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం.. ఒకే దర్శకుడికి ఎక్కువ కాల్ షీట్స్ ఇచ్చే అంత పరిస్థితి ఏ మాత్రం లేదు. లేట్ అయినా పర్లేదు సుదీర్ఘంగా తీస్తూ పోతామంటే అయ్యే పని కాదు. ఎందుకంటే బాహుబలి, సాహో, రాధే శ్యామ్ తర్వాత ఇకపై ప్రభాస్ డైరీలో ఆలస్యానికి చోటు ఉండదని హామీ ఇచ్చాడు. అందుకే గ్యాప్ లేకుండ కొత్త ప్రాజెక్ట్స్ మీద సంతకం చేస్తున్నాడు.

రీసెంట్ గా హోంబాలే ఫిలింస్ కి మూడు ప్యాన్ ఇండియా కమిట్మెంట్లు ఇచ్చేశాడు. దీనితో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా వచ్చిన చాలు అనుకుంటుంటే.. డార్లింగ్ మాత్రం రెండేసి సినిమాలు, వరుస అప్డేట్స్ తో వరాలు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి 2025 ఎవరికీ ఎలా ఉన్నా కానీ.. డార్లింగ్ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ శాటిస్ఫాక్షన్ ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. సందీప్ చేతిలో కూడా భారీ ప్రాజెక్ట్స్ వెయిట్ చేస్తున్నాయి. అటు యానిమల్ పార్క్ రెడీ గా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం రాసే స్క్రిప్ట్ మీద ద్రుష్టి పెట్టాలి. సందీప్- బన్నీ కాంబినేషన్ ఎప్పుడో ఏడాది క్రితం అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. బన్నీ కూడా పుష్ప 2 తో బిజీ అయ్యాడు. అది అయినా వెంటనే త్రివిక్రమ్ కు డేట్స్ ఇచ్చాడు. సో అది అయ్యేలోగా సందీప్ యానిమల్ , స్పిరిట్ సినిమాలను కంప్లీట్ చేయొచ్చు. చూడబోతుంటే టాలీవుడ్ లో ఈ సినిమాలన్నీ ఓ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş