iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ పార్ట్ 2 కూడానా !

  • Published Aug 06, 2025 | 11:53 AM Updated Updated Aug 06, 2025 | 11:53 AM

సిక్వెల్స్ ట్రెండ్ సెట్ చేసిన హీరో ఎవరంటే అందరు చెప్పేది ప్రభాస్ గురించే. బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత నుంచి ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే దానికి పార్ట్ 2 ఉండడం ఆనవాయితీ అయిపొయింది. కల్కి 2 , సలార్ 2 లాంటివి ఆల్రెడీ లైన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాజాసాబ్ కూడా యాడ్ అయింది.

సిక్వెల్స్ ట్రెండ్ సెట్ చేసిన హీరో ఎవరంటే అందరు చెప్పేది ప్రభాస్ గురించే. బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత నుంచి ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే దానికి పార్ట్ 2 ఉండడం ఆనవాయితీ అయిపొయింది. కల్కి 2 , సలార్ 2 లాంటివి ఆల్రెడీ లైన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాజాసాబ్ కూడా యాడ్ అయింది.

  • Published Aug 06, 2025 | 11:53 AMUpdated Aug 06, 2025 | 11:53 AM
రాజాసాబ్ పార్ట్ 2 కూడానా !

సిక్వెల్స్ ట్రెండ్ సెట్ చేసిన హీరో ఎవరంటే అందరు చెప్పేది ప్రభాస్ గురించే. బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత నుంచి ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే దానికి పార్ట్ 2 ఉండడం ఆనవాయితీ అయిపొయింది. కల్కి 2 , సలార్ 2 లాంటివి ఆల్రెడీ లైన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాజాసాబ్ కూడా యాడ్ అయింది. అసలు ఈ సినిమాకు మొదటి నుంచి సిక్వెల్ అనౌన్సుమెంట్ అయితే ఏమి లేదు. పైగా ముందు అసలు సినిమా రిలీజ్ అయితే చాలని అంతా అనుకుంటున్నారు. ఈ గ్యాప్ లో పార్ట్ 2 కూడా ఉండనుందని నిర్మాత చెప్పుకొచ్చారు.

రాజాసాబ్ షూటింగ్ ఫుటేజ్ మొత్తం నాలుగున్నర గంటలు వచ్చిందట. ప్రస్తుతం దానిని 2 గంటల 45 నిమిషాలకు కుదించే పనిలో దర్శకుడు మారుతి బిజీగా ఉన్నాడు. వీలైతే సినిమా నిడివి 3 గంటలు కూడా ఉండొచ్చని టాక్. అలాగే సినిమా పోస్ట్ పోన్ గురించి కూడా నిర్మాత చెప్పుకొచ్చారు. అలాగే రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని అన్నారు. కానీ అది పార్ట్ 1 కు కొనసాగింపుగా కాకుండా .. సేమ్ థీమ్ , సేమ్ ఎలిమెంట్స్ లో అదే ఫ్రాంచైజ్ లో మరో సినిమా రూపంలో వస్తుందని చెప్పారు.

ఇక రాజాసాబ్ షూటింగ్ విషయానికొస్తే.. ఇంకా కొన్ని సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అది కాకుండా రిమైనింగ్ టాకీ పార్ట్ అంతా దాదాపు కంప్లీట్ అయిందట. అక్టోబర్ లాస్ట్ వీక్ కు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి రానున్నాయి. ఇక రిలీజ్ డేట్ లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సో ఈ సినిమా నుంచి ఎలాంటి షాకింగ్ అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.