Salaar Teaser: సలార్ టీజర్ రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ కు మించి..!

Salaar Teaser: సలార్ టీజర్ రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ కు మించి..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈరోజు ఉదయాన్నే 5 గంటలకే అలారం పెట్టుకుని లేచారు. మరికొంత మంది అయితే క్యురియాసిటీతో అసలు నిద్ర కూడా పోలేదు. ఎందుకు అంటే జులై 6 తెల్లవారుజామున 5.11కి సలార్ టిజీర్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమా నుంచి పోస్టర్స్ కాకుండా మొదటిసారి టీజర్ రిలీజ్ చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి, సినిమా ప్రేక్షకుల్లో ఉత్సాహం రెండూ పెరిగిపోయాయి. మరి.. ఈ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టీజర్ ఎలా ఉంది? ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో మెప్పించబోతున్నాడో చూద్దాం.

ఈ టీజర్ చూసిన తర్వాత గతంలో ప్రశాంత్ నీల్ గురించి కేజీఎఫ్ నటుడు యశ్ చెప్పిన మాటలు గుర్తురాక మానవు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చూసి దేశం మొత్తం ఉర్రూతలూగిపోయింది. కానీ, అది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ యశ్ ఓసారి కామెంట్ చేశాడు. మేము సాధారణంగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అతను నాకు చాలా విషయాలు చెప్పాడు. అతని ఐడియాస్ మొత్తం నాకు తెలుసు. అతని నెరేషన్ లో కేజీఎఫ్ అని జస్ట్ టీజర్ మాత్రమే అంటూ యశ్ కామెంట్ చేశాడు. సలార్ టీజర్ చూసిన తర్వాత అదే నిజం అనిపిస్తుంది.

సలార్ టీజర్ గురించి 90 సెకన్ల సునామీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న నిజంగా నిజమే. ప్రభాస్ ఒక సునామీలా కనిపించాడు. టీజర్ చూసిన తర్వాత మోస్ట్ వైలెంట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అని అనక మానరు. ఒక్కో ఫ్రేమ్, ఒక్కో షాట్ మైండ్ పోగొట్టక మానదు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలను చూసి ప్రశాంత్ నీల్ ని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ రెండు సినిమాలకు మించి సలార్ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీజర్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేశాడు.

ముఖ్యంగా రవి బస్రూర్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఈ టీజర్ ఎడిటింగ్ కేజీఎఫ్ 2 కార్ ఛేజ్ ఫైట్ స్టైల్ లో ఉజ్వల్ కుల్ కర్మి కట్ చేశాడు. ఈ టీజర్ లో ఒకటే డైలాగ్ ఉంది. మీరు అడవిలో చిరుత, సింహం, పులిని చూసి భయపడతారు. కానీ, జురాసిక్ పార్క్ లో కాదు. అక్కడ కేవలం అంటూ అనగానే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అంటే ఈ మూవీలో పులులు, సింహాలు, చిరుతలు అని చెప్పుకునే గ్యాంగ్ స్టర్లు ఎంత మంది ఉన్నా.. ప్రభాస్ ఒక డైనోసార్ అని చెప్పుకొచ్చారు. అసలు స్టోరీ తెలియాలంటే మీరు సెప్టెంబర్ 28న థియేటర్లలో సినిమా చూడాల్సిందే.

Show comments