iDreamPost
android-app
ios-app

పౌర్ణమి మూవీలో ప్రభాస్ పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే.?

  • Published Aug 24, 2024 | 3:25 PM Updated Updated Aug 24, 2024 | 3:25 PM

వర్షం తర్వాత.. అదే ప్రొడక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం పౌర్ణమి. ప్రభుదేవా దర్శకుడు. త్రిష, చార్మీ, సింధు తులానీ హీరో హీరోయిన్లు. కాగా, ఇందులో మరో బ్యూటీ కూడా యాక్ట్ చేసింది. డార్లింగ్ ను పడేసేందుకు ప్రయత్నించే మహిళగా..

వర్షం తర్వాత.. అదే ప్రొడక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం పౌర్ణమి. ప్రభుదేవా దర్శకుడు. త్రిష, చార్మీ, సింధు తులానీ హీరో హీరోయిన్లు. కాగా, ఇందులో మరో బ్యూటీ కూడా యాక్ట్ చేసింది. డార్లింగ్ ను పడేసేందుకు ప్రయత్నించే మహిళగా..

  • Published Aug 24, 2024 | 3:25 PMUpdated Aug 24, 2024 | 3:25 PM
పౌర్ణమి మూవీలో ప్రభాస్ పక్కన నటించిన ఈ  హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. సలార్, కల్కి 2898ఏడీ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మరింత జోరు పెంచాడు. ఆయన యాక్ట్ చేస్తున్న మూవీ లైనప్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఈ క్రమంలో ఓ బ్యూటీ డార్లింగ్ సరసన నటించబోతున్న వార్త హల్ చల్ చేస్తుంది. ఒకప్పటి బెస్ట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్- త్రిషల జోడీ మరోసారి సందడి చేయనుందన్న టాక్ నడుస్తుంది. ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రాల్లో ఒకటి  పౌర్ణమి. వర్షం మూవీతో హిట్ కొట్టిన ఈ పెయిర్.. పౌర్ణమి మూవీతో మరోసారి జతకట్టింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఎంఎస్ రాజు తెరకెక్కించాడు. ఇందులో త్రిష, ఛార్మీ, సింధుతులానీ కాకుండా మరో హీరోయిన్ నటించింది తెలుసా..? మోహిని పాత్రలో ప్రభాస్‌ను ఇష్టపడే వివాహితగా కనిపిస్తుంది మధు శర్మ.

ముంబయికి చెందిన ఈ భామ.. పాన్ ఇండియన్ స్టార్. ఎక్కువగా సెకండ్ హీరోయిన్, వ్యాంప్ క్యారెక్టర్లలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో గురు పర్వాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ.. జగపతి బాబు హీరోగా వచ్చిన పాండులో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. శివాజీ, లయ హీరో హీరోయిన్లుగా నటించిన అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్‌సి చిత్రాల్లో నటించింది. అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో మెయిన్ లీడ్‌గా నటించింది. తర్వాత పౌర్ణమిలో మోహిని పాత్రలో నటించింది. ఇందులో 60 ఏళ్ల ఏవీఎస్‌కు భార్యగా కనిపిస్తుంది. ప్రభాస్‌ను వలలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఉండేది కాసేపు అయినా.. కట్టిపడేస్తుంది.

పౌర్ణమి తర్వాత ఆమె రెండు చిత్రాలు మాత్రమే చేసింది. శ్రీహరి హీరోగా వచ్చిన హనుమంతు, బ్రహ్మా చిత్రాల్లో యాక్ట్ చేసింది.ఆ తర్వాత ఆమె తెలుగు తెరకు పూర్తిగా దూరం అయ్యింది. హిందీ,తమిళ్ చేసి ఇప్పుడు భోజ్ పురికి షిప్ట్ అయ్యింది. ఇటు భోజ్ పురి సినిమాలతో పాటు ఓ హిందీ చిత్రంలో యాక్ట్ చేస్తోంది మధు శర్మ. శ్రీ 420తో పాటు హ్యూమా ఖురేషీ మెయిన్ లీడ్ చేస్తోన్న బయాన్ మూవీ చేస్తోంది. పూర్తిగా టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైన ఈ నటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వ్యవహరిస్తోంది. సినిమా అప్డేట్స్, ఇతర విషయాలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంది ఒకప్పటి స్టార్ బ్యూటీ. చాలా మంది హీరోయిన్స్ మళ్లీ తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ తరుణంలో ఆమె కూడా రావాలని ఆశిద్దాం..? ఏమంటారు…?

 

View this post on Instagram

 

A post shared by Madhhu Shharma (@madhhuis)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet