iDreamPost
android-app
ios-app

ప్రభాస్ లైన్ అప్స్ లిస్ట్ లో మరో 6..? ఏంటి డార్లింగ్ ఇది

  • Published Nov 05, 2024 | 2:36 PM Updated Updated Nov 05, 2024 | 2:36 PM

Prabhas Upcoming Movies List : ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు వింటుంటే నెక్స్ట్ రాబోయే సినిమాలే కళ్ళ ముందే మెదులుతున్నాయి. ఏ హీరోకైనా ఒక సినిమా తీసేటప్పుడు మహా అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉంటాయి. కానీ ప్రభాస్ చేతిలో మాత్రం ఏకంగా 11 సినిమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Prabhas Upcoming Movies List : ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు వింటుంటే నెక్స్ట్ రాబోయే సినిమాలే కళ్ళ ముందే మెదులుతున్నాయి. ఏ హీరోకైనా ఒక సినిమా తీసేటప్పుడు మహా అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉంటాయి. కానీ ప్రభాస్ చేతిలో మాత్రం ఏకంగా 11 సినిమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 05, 2024 | 2:36 PMUpdated Nov 05, 2024 | 2:36 PM
ప్రభాస్ లైన్ అప్స్ లిస్ట్ లో మరో 6..? ఏంటి డార్లింగ్ ఇది

ఏ స్టార్ హీరోకైనా లైన్ అప్ లో మహా అయితే రెండు నుంచి మూడు సినిమాలు ఉంటాయి. కానీ ప్రభాస్ లైన్ అప్ గురించి వింటుంటే మాత్రం.. ఒక్కొక్కరికి దిమ్మ తిరుగుతుంది. మూడు నాలుగు సినిమాలైతే అనుకోవచ్చు కానీ ఏకంగా 11 సినిమాలంటే మాటలా. 11 సినిమాలేంటి అనుకుంటున్నారా. ఆల్రెడీ ప్రభాస్ లిస్ట్ లో కన్ఫర్మ్ అయినా 5 సినిమాల గురించి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో ఉన్నాడు. దాదాపు ఈ ఏడాది ఆఖరికి ఆ షూట్ ను కంప్లీట్ చేస్తాడు. అది అయిన వెంటనే ఫౌజీ మూవీ పట్టాలెక్కేస్తుంది. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ , ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2 , నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్ 2. ఇక్కడివరకు అందరికి తెలిసిన సినిమాలే. ఇలా వరుస లైన్ అప్స్ గురించే కాదు.. డార్లింగ్ సెలెక్ట్ చేసుకునే జోనర్స్ కూడా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి.

బాహుబలి నుంచి చూసినట్లయితే పీరియాడిక్ ఫాంటసీ , యాక్షన్ థ్రిల్లర్ , లవ్ స్టోరీస్ , మైథలాజికల్ , మాస్ మూవీస్ , సైన్స్ ఫిక్షన్ ఇలా టచ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా దేనికదే ప్రత్యేకం . ఇవే ఇలా ఉంటే అప్ కమింగ్ మూవీస్ కూడా డిఫరెంట్ జోనర్స్ ఏ. రాజాసాబ్ హర్రర్ కామెడీ.. ఫౌజీ యుద్ధం , మిలట్రీ బ్యాక్డ్రాప్ లా ఉంటుందని టాక్ , స్పిరిట్ విషయానికొస్తే అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. సందీప్ సినిమాలలోని క్యారెక్టర్స్ అన్ని కూడా డీప్ గా ఉంటాయి. సో పర్టిక్యులర్ గా ఇదే జోనర్ అని చెప్పలేము. నెక్స్ట్ సలార్ 2 మాస్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. కరెక్ట్ టైం కు రిలీజ్ చేస్తే మాత్రం.. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన ఊచకోత అంటే కనిపిస్తుందని సమాచారం. ఇక కల్కి 2 సైన్స్ ఫిక్షన్. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఈసారి బాహుబలి కలెక్షన్స్ దాటేస్తుందని టాక్. ఇక ఈ సినిమాలు కాకుండా నెక్స్ట్ లైన్ అప్ లో యాడ్ అయిన సినిమాల విషయానికొస్తే..

బ్రహ్మ రాక్షస్ మూవీ ఇది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతుంది. సినిమా టైటిల్ ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ నెగెటివ్ షేడ్ లో ఉంటాడనిపిస్తుంది. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రావణం మూవీ.. ఇది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రానున్న మూవీ అని సమాచారం. ఆల్రెడీ గతంలో ఓసారి దిల్ రాజు ఓసారి బయటపెట్టారు. కానీ ఈ మూవీ రావడానికి మాత్రం చాలానే టైం పడుతుంది. ఇది కాకుండా రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ తో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం తెలిసిందే. ఇవి ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న సినిమాలు. ఇవి కాకుండా డిస్కషన్స్ లో మరో మూడు సినిమాలు ఉన్నాయట. పృద్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఓ మూవీ.. సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో టి సిరీస్ తో టై అప్ అయ్యి మరో మూవీ.. ఫైనల్ గా తెలుగులో ఓ టాప్ డైరెక్టర్ తో ఫ్యామిలీ డ్రామా మూవీ ఉండబోతుందని టాక్. డిస్కషన్స్ లో ఉన్న సినిమాలలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే కనుక.. ఇక ప్రభాస్ రికార్డ్స్ కొట్టేవారు ఎవరు ఉండరు. ఇది విన్న డార్లింగ్ అభిమానులు … టాలీవుడ్ బాలీవుడ్ ఉండదు అంతా రెబెల్ వుడ్ మాత్రమే ఉంటుంది.. ప్రభాస్ కు ఇవన్నీ చాలా కామన్.. అంటూ మురిసిపోతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.   మరి ప్రభాస్ లైన్ అప్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom