iDreamPost
android-app
ios-app

ప్రాజెక్ట్ K.. ఊహించని రేంజ్ లో పెద్ద ప్లానే జరుగుతోందా? పిక్ వైరల్!

  • Author ajaykrishna Published - 03:17 PM, Sat - 15 July 23
  • Author ajaykrishna Published - 03:17 PM, Sat - 15 July 23
ప్రాజెక్ట్ K.. ఊహించని రేంజ్ లో పెద్ద ప్లానే జరుగుతోందా? పిక్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టిజియస్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న మాఫియా యాక్షన్ డ్రామా ‘సలార్’ మూవీ తర్వాత.. ప్రాజెక్ట్ కే మూవీనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముందు నుండి పాన్ వరల్డ్ మూవీగా ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్ కే మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో పకడ్బంధీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తుండగా.. లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ నెల 20న ప్రాజెక్ట్ కే టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు చిన్నపాటి వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ ని అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ లో జులై 20న ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కామిక్ కాన్ లో లాంచ్ అవుతున్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే రికార్డు సెట్ చేసింది. ఈ వేడుకకు ప్రాజెక్ట్ కే టీమ్.. ప్రభాస్, దీపికా, నిర్మాత అశ్వినిదత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెళ్లనున్నట్లు సమాచారం. ముందుగా అమెరికాలోని కామిక్ కాన్ లో టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశాక.. తర్వాత రోజు ఇండియాలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకి పలు క్రేజీ పేర్లు బయట ప్రచారంలో ఉన్నాయి.

కర్ణ, కల్కి..లతో పాటు సినిమా టైమ్ ట్రావెలింగ్ సబ్జెక్టు కూడా ఉంటుందని.. కాలచక్ర అనే టైటిల్ కూడా వైరల్ అవుతోంది. మరి ఇందులో ప్రాజెక్ట్ కే టైటిల్ ఉందా లేక నాగ్ అశ్విన్ వేరే ఏమైనా సర్ప్రైజ్ చేయబోతున్నాడా అనేది జులై 20న తెలియబోతుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా.. రెండు భాగాలుగా రానుందని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. సినిమా ఇండియన్ మైథాలజీని టచ్ చేస్తూ ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ అయితే.. ప్రభాస్ ని పెట్టి.. ప్రాజెక్ట్ కే తో ఓ కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. కాగా.. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రెజెంట్ సినిమా గ్లింప్స్ షూటింగ్ నడుస్తుండగా.. ఆ షూటింగ్ సెట్ లో నుండి ప్రభాస్ పిక్ ఒకటి లీక్ అయ్యింది. అదే పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మరి ప్రాజెక్ట్ కే మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş