iDreamPost
android-app
ios-app

కల్కి టీమ్‌ బంపరాఫర్‌.. ప్రభాస్‌ బుజ్జితో సెల్ఫీ దిగే అవకాశం.. డోన్ట్‌ మిస్‌

  • Published May 27, 2024 | 5:33 PM Updated Updated May 27, 2024 | 5:33 PM

Prabhas Kalki 2898: కల్కి టీమ్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. సినిమాకే హైలెట్‌గా నిలిచే బుజ్జి కారుతో సెల్ఫీ దిగే అవకాశం కల్పించింది. ఆ వివరాలు..

Prabhas Kalki 2898: కల్కి టీమ్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. సినిమాకే హైలెట్‌గా నిలిచే బుజ్జి కారుతో సెల్ఫీ దిగే అవకాశం కల్పించింది. ఆ వివరాలు..

  • Published May 27, 2024 | 5:33 PMUpdated May 27, 2024 | 5:33 PM
కల్కి టీమ్‌ బంపరాఫర్‌.. ప్రభాస్‌ బుజ్జితో సెల్ఫీ దిగే అవకాశం.. డోన్ట్‌ మిస్‌

సినిమా అభిమానులు పాన్‌ ఇండియా లెవల్లో చర్చించుకునే మూవీ ఏదైనా ఉందా అంటే అది డార్లింగ్‌ ప్రభాస్‌ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ చిత్రమే. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో.. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి భారీ తాగాణంతో.. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత అనగా జూన్‌ 27, 2024న ఈ చిత్రం ప్రేక్షకులు మందుకు రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకోనె నటిస్తుంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై.. అశ్వినీదత్‌.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కల్కి విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో మేకర్స్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఇప్పటికే కల్కి చిత్రంలో కీలక పాత్ర పోషించే బుజ్జి అనే ప్రత్యేకమైన కారు పరిచయం కోసం భారీ ఎత్తున వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే.

సోషల్‌ మీడియా వేదికగా.. డార్లింగ్‌ ప్రభాస్‌ బుజ్జి గురించి పోస్ట్‌ చేయడంతో.. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత బుజ్జి మేకింగ్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. ఇక కొన్ని రోజుల క్రితం బుజ్జిని పరిచయం చేసేందుకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేంజ్లో భారీ వేడుక నిర్వహించారు. ఇక అప్పటి నుంచి మీడియా, సోషల్‌ మీడియాలో బుజ్జికి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. బుజ్జి తయారీ కోసం ఏకంగా 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. చాలా మంది ఆటోమొబైల్‌ వినియోగదారులు బుజ్జి ప్రత్యేకతలు, ఖర్చు గురించి వీడియోలు చేశారు. ఇక ఆటో మొబైల్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా కూడా బుజ్జిపై ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా నాగ చైతన్య బుజ్జిపై మనసు పారేసుకోవడమే కాక.. దాన్ని డ్రైవ్‌ చేసి మరీ ఆనందించాడు.

ఇక కల్కి ప్రమోషన్లలో భాగంగా.. సినిమాలో కీ రోల్‌ పోషించే బుజ్జితో సెల్ఫీ దిగే అవకాశం కల్పిస్తోంది చిత్ర బృందం. అలానే మరికొందరు ప్రముఖులు కూడా బుజ్జిని డ్రైవ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కల్కీ ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం.. బుజ్జిని దేశంలోని వివిధ నగరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుందంట. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో.. దీన్ని ప్రదర్శించేందుకు మూవీ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. ఇదే సమయంలో అభిమానులను బుజ్జితో సెల్ఫీ దిగేందుకు కూడా అనుమతిస్తారంట. సో ఫ్యాన్స్‌ బీ రెడీ.. బుజ్జితో సెల్ఫీ దిగే ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు అంటున్నారు. ఇక ఈ బుజ్జిని మహీంద్రా కంపెనీ తయారు చేసింది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş