iDreamPost
android-app
ios-app

దర్శన్ ఈగోపై కొట్టిన ప్రభాస్! అక్కడ జెండా పాతేశాడు!

  • Published Jun 29, 2024 | 3:24 PM Updated Updated Jun 29, 2024 | 3:24 PM

Prabhas Kalki 2898 AD Records in Karnataka: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో హీరో దర్శన్ ఈగోపై ప్రభాస్ గట్టిగానే కొట్టాడు.

Prabhas Kalki 2898 AD Records in Karnataka: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో హీరో దర్శన్ ఈగోపై ప్రభాస్ గట్టిగానే కొట్టాడు.

  • Published Jun 29, 2024 | 3:24 PMUpdated Jun 29, 2024 | 3:24 PM
దర్శన్ ఈగోపై కొట్టిన ప్రభాస్! అక్కడ జెండా పాతేశాడు!

కల్కి 2898 ఏడీ సినిమా ఇప్పుడు ఒక్క పాన్ ఇండియానే కాదు.. వరల్డ్ వైడ్ గా వినిపిస్తున్న పేరు. సినిమా లవర్స్ అంతా ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నాలుగు సంవత్సరాలు అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూశారు. నాగ్ అశ్విన్ తీసుకొచ్చిన ఈ విజువల్ వండర్ కి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయిపోయారు. వాళ్ల అభిమానం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. ఈ మూవీకి రిపీట్ ఆడియన్స్ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే కల్కి 2898 ఏడీ రికార్డులు ఒక దగ్గర మాత్రం రీసౌండింగ్ వస్తున్నాయి. అంతేకాకుండా డీ బాస్.. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఈగోపై ప్రభాస్ కొట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అసలు ఆ లెక్క ఏంటో చూద్దాం.

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమాకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద నాన్ వీకెండ్ లో ఈ మూవీ డే 1 ఏకంగా రూ.191.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇంక రెండో రోజు అయితే ఆ లెక్క మరింత పెరిగింది. రెండురోజుల్లో ఈ మూవీ గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.298.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దర్శన్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఉన్న ఆ పంచాయితీ ఏంటో దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది.

సలార్ రిలీజ్ సమయంలో కాటేరా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో సినిమా వాయిదా వేసుకునే ఆలోచన ఉందా అని అడగ్గా.. దర్శన్ తగ్గేది లేదు అంటూ కామెంట్స్ చేశాడు. కర్ణాటకలో మన సినిమా ఉన్నప్పుడు రిలీజ్ కి రావాలి అంటే వాళ్లే భయపడాలి అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే కర్ణాటకలో సలార్ సినిమాకి డే1లో ఊహించిన అంత రెస్పాన్స్ రాలేదు. ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త హర్ట్ అయ్యారు. ఆ విషయం ఇప్పుడు మరోసారి కల్కి రిలీజ్ సందర్భంగా తెరపైకి వచ్చింది. కర్ణాటకలో కల్కి సినిమా డే1లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

కాటేరా సినిమా ఫస్ట్ డేలో రూ.8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా.. కల్కి 2898 ఏడీ మూవీ ఫస్ట్ డేలో ఏకంగా రూ.11.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. సలార్ సినిమా సమయంలో దర్శన్ చేసిన వ్యాఖ్యలకు కల్కి సినిమాతో సమాధానం చెప్పినట్లు అయ్యింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటకలో దర్శన్ కంటే ప్రభాస్ సినిమాకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దర్శన్ ఈగో మీద ప్రభాస్ గట్టిగా కొట్టాడు అంటూ చెబుతున్నారు. కాగా.. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ సొంత అభిమాని హత్య కేసులో రిమాండు ఖైదీగా జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet