iDreamPost
android-app
ios-app

Prabhas: లండన్‌లో విలాసవంతమైన భవనంలోకి ప్రభాస్.. మకాం అక్కడేనటా..?

  • Published Feb 26, 2024 | 6:09 PM Updated Updated Feb 26, 2024 | 7:34 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కల్కి మే 9న విడుదల కానుంది. కాగా, ఆ తర్వాత డార్లింగ్.. లండన్ కు మకాం మార్చనున్నాడట. ఎందుకంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కల్కి మే 9న విడుదల కానుంది. కాగా, ఆ తర్వాత డార్లింగ్.. లండన్ కు మకాం మార్చనున్నాడట. ఎందుకంటే..?

  • Published Feb 26, 2024 | 6:09 PMUpdated Feb 26, 2024 | 7:34 PM
Prabhas: లండన్‌లో విలాసవంతమైన భవనంలోకి ప్రభాస్.. మకాం అక్కడేనటా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస లైనప్స్‌తో బిజీగా మారిపోయాడు. గత ఏడాది రెండు సినిమాలతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. ఆదిపురుష్ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లు ఓ రేంజ్‌లో వచ్చాయి. ఇక గత డిసెంబర్ చివరిలో వచ్చిన సలార్.. బాక్సాఫీసుకు ముచ్చెమటలు పట్టించిన సంగతి విదితమే. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూపాయాలకు పైగా వసూళ్లను రాబట్టుకుని ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం కల్కి 2898 ఎడీతో పాటు రాజా సాబ్, కన్నప్ప షూటింగ్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అలాగే సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడితో ఓ కథ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇక్కడ షూటింగ్స్ చేస్తూనే.. తరచూ విదేశాలకు వెళ్లి వస్తున్న సంగతి విదితమే.

ఇదిలా ఉంటే ఇప్పుడొక ఇంటస్ట్రింగ్ అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ మకాం మారుస్తున్నారట. ఇండియా నుండి లండన్ షిఫ్ట్ అవ్వబోతున్నారట. ఎందుకంటే.. అక్కడ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంత సడెన్ గా ఏంటీ నిర్ణయం అనుకుంటున్నారా.? కొన్నాళ్ల క్రితం ప్రభాస్ కాలికి గాయం అయ్యింది. ఈ నేపథ్యంలో లండన్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. అక్కడకు పలుమార్లు వెళ్లి వస్తున్నారు. దీంతో పాటు కొన్ని రోజులు పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో లండన్‌లో ఆ భవనాన్ని లీజుకు తీసుకున్నారని తెలుస్తోంది. దీనికి ప్రతి నెల రూ. 60 లక్షల అద్దె చెల్లించబోతున్నాడని టాలీవుడ్ టాక్. అయితే గతంలోనూ అతడు ఇటలీలో కొన్నాళ్ల పాటు ఉన్నాడు. అక్కడ కూడా లక్షల విలువ చేసే భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా లండన్‌లో భవనం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరో రెండు నెలల్లో కల్కి మూవీ రాబోతుంది. ఆ తర్వాత ఖరీదైన నివాసంలో రెస్ట్ తీసుకోనున్నారు. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించింది. దిశా పటానీ, అమితా బచ్చన్, కమల్ హాసన్, అన్నా బెన్ వంటి నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ, జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరీ అది నిజమో కాదో తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom