iDreamPost
android-app
ios-app

ఏంటి బాస్ నువ్వు వరదరాజమన్నార్ వేనా.. ఇన్ స్టాలో ప్రభాస్

  • Published Mar 10, 2024 | 2:09 PM Updated Updated Mar 10, 2024 | 2:09 PM

ద గోట్ లైఫ్ ఆపీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు సంబంధించి ప్రభాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ద గోట్ లైఫ్ ఆపీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు సంబంధించి ప్రభాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 10, 2024 | 2:09 PMUpdated Mar 10, 2024 | 2:09 PM
ఏంటి బాస్ నువ్వు వరదరాజమన్నార్ వేనా.. ఇన్ స్టాలో ప్రభాస్

ద గోట్ లైఫ్ ఆపీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. పూనకాలు లోడయ్యాయి. పాన్ ఇండియా డైమన్షన్ ఇవ్వాళరేపు మామ్మూలుగా లేదు. అందరూ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇమేజులు, ప్రతీ కంట్రీలో ఫ్యాన్స్ కోలాహలంతో ట్రైలర్ రిలీజయిందంటే చాలు ఒకటే కలకలం. పైగా హీరో నిజంగానే వెరీ పాప్యులర్ అండ్ ఫేమస్ అయితే ఇంక ఆ ట్రైలర్ పుట్టించే కేకతో సినిమా ప్రపంచం దద్దరిల్లిపోతుంది. అదే జరిగింది ద గోట్ లైఫ్ ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే. ప్రిధ్వీరాజ్ సుకుమారన్ అంటే ఇవ్వాళ రేపు క్రేజ్ ఇరగదీసెస్తోంది. మళయాళ, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మురిపించడమే కాకుండా, నేషనల్ అవార్డులు, సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మళయాళంలో బెస్ యాక్టర్ అవార్డులతో, వంద సినిమాలకు పైచిలుకు సినిమాలతో దూసుకుపోతున్న సుకుమారన్ కి సలార్ సినిమాలో ప్రభాస్ కాంబో తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టింది.

అందుకే సుకుమారన్ సినిమా ద గోట్ లైఫ్ మార్చి 28న విడుదలవుతోందంటే ముందుగా బ్రేక్ అయన అఫీషియల్ ట్రైలర్ 1.33 నిమిషాల చిన్న లెంత్ లో ఉన్నా సరే.. కలకలం పుట్టించింది. పైగా విజువల్స్ నార్మల్ గా లేవు. ఆడియన్స్ చాలా అరుదుగా చూడగలిగే లొకేషన్స్, అద్భుతమైన యాంగిల్స్, ఫ్రేమ్స్, అందులోనూ ప్రిధ్వీరాజ్ గెటప్, లుక్స్ కళ్ళు చెదరగొట్టేశాయి. సర్వైవల్ ధ్రిల్లర్ గా తెరకెక్కిన గోట్ లైఫ్ కథకూడా అసాధారణంగా ఉంది. ఒక ఖండం నుంచి మరో ఖండానికి కాలినడకన రావడమా.. ఆశ్చర్యం ప్లస్ షాక్. క్లోజ్ షాట్సులో హీరో ఫేస్, ఐస్.. ఓహ్.. ఓ న్యూ ఎక్స్ పీరియన్స్.
అందుకే మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మెస్మరైజ్ అయ్యాడు. ప్రిధ్వీరాజ్ అండ్ ప్రభాస్ సలార్ సినిమాలో కలసి యాక్ట్ చేశారేమ్.. దానితో ప్రభాస్ మరీ మరీ టచ్చింగ్ గా ఫీలయ్యాడు. ట్రైలర్ చూడగానే తనలో కలిగిన సర్ప్రరైజ్ ని దాచుకోలేకపోయాడు. వెంటనే తన ఎక్స్ హేండిల్ మీద తన షాకింగ్ ఎక్సిపీరియన్స్ ని ఒలికించాడు.

Prabhas

ఏంటి బాస్.. నువ్వేనా.. వరదరాజమన్నార్ క్యారెక్టర్ చేసింది నువ్వేనా.. కాదు బ్రో.. నమ్మలేకపోయాననుకో.. ఏం చేశావ్.. గోట్ లైఫ్ లో చేసిన పర్సన్ అండ్ ట్రైలర్లో చూసిన పర్సన్ ఒక్కడే అంటే నమ్మబుద్ది కావడంలేదు. పెంటాస్టిక్ బ్రదర్.. కంగ్రాట్స్. బ్లాక్ బస్టర్ లోడవుతోంది. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్.. అని ట్వీట్ చేశాడు ప్రభాస్. ప్రభాస్ లాటి హీరోయే స్టన్ అయ్యాడంటే సామాన్య జనం పరిస్థితి ఏంటి? అందుకే మార్చి 28 కోసం అందరూ చాలా ఎక్సైట్మ్మంటె తో ఎదురుచూస్తున్నారు. కరోనా టైంలో ప్రపంచంలో అన్ని సినిమాలు ఇంటి దగ్గర కూర్చుని తీరిగ్గా చూసేసిన ఆల్ క్లాసెస్ ఆడియన్స్ ఇప్పుడు జనరల్ సినిమాలను పెద్దగా ఎంకరేజ్ చేయడంలేదు. ఏదో ఒక ధ్రిల్ లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. ద గోట్ లైప్ పక్కన పెట్టేటట్టు లేదు. నెత్తిమీద పెట్టుకునే రేంజ్ లో ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet