iDreamPost
android-app
ios-app

మరోసారి లవ్ స్టొరీలో నటించనున్న ప్రభాస్?

  • Published Feb 28, 2024 | 3:41 PMUpdated Feb 28, 2024 | 3:41 PM

Prabhas Next Movie Expectations: ఇటీవల ప్రభాస్ నటించిన మూవీస్ వరుసగా లైన్ లోకి వచ్చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ 'క‌ల్కి 2898 AD', మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్ ' తర్వాత ప్రభాస్ ఏలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

Prabhas Next Movie Expectations: ఇటీవల ప్రభాస్ నటించిన మూవీస్ వరుసగా లైన్ లోకి వచ్చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ 'క‌ల్కి 2898 AD', మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్ ' తర్వాత ప్రభాస్ ఏలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

  • Published Feb 28, 2024 | 3:41 PMUpdated Feb 28, 2024 | 3:41 PM
మరోసారి లవ్ స్టొరీలో నటించనున్న ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్రస్తుతం చాలా బిజీ షెడ్యుల్ లో ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘క‌ల్కి 2898 AD’ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. మే 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాతలు ప్ర‌క‌టించారు. నిజానికి పెండింగ్ వర్క్ ఎక్కువే ఉన్నా… అనుకున్న తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉన్నారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘ ది రాజాసాబ్ ‘ సినిమాకి కూడా ప్రభాస్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి తో ఒక ఎపిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ నటిస్తారనే ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

నిజానికి కల్కి 2898 AD సినిమాతో పాటు ది రాజా సాబ్ సినిమాలు పూర్తి చేయటానికి ప్రభాస్ కు కాస్త స‌మ‌యం ప‌డుతుంది. మ‌రో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘స‌లార్-2’ సినిమాకి కూడా ప్రభాస్ డేట్లు సర్దాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. మ‌రో వైపు డైనమిక్ డెరైక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని కూడా ప్రభాస్ ఒప్పుకున్నారు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమా మొద‌లవ్వొచ్చ‌ని ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగా హింట్ కూడా ఇచ్చారు. ఇన్ని సినిమాల మధ్యలో హ‌ను రాఘ‌వ‌పూడితో కూడా ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న‌ట్లు తాజా వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ట్లు టాక్. ఇది వ‌ర‌ల్డ్ వార్ నేప‌థ్యంలో సాగే అద్భుత‌మైన ల‌వ్ స్టోరీ అంటున్నారు. క్లాసికల్ బ్లాక్ బస్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న సీతా రామం సినిమాలో కూడా హీరో దుల్కర్ మిలిటరీ అధికారిగా కనిపించారు. ప్రేమ కథే అయినా ఆ సినిమాలో ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది . ఇక ఫ్లాప్ అయినా సరే రాధే శ్యామ్ వంటి లవ్ స్టోరీలో కనిపించిన ప్రభాస్… సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులని అలరించారు. మరిప్పుడు ప్రభాస్ హను రాఘవపూడితో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో మరోసారి లవ్ స్టోరీలో తీస్తున్నారంటే ఖచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే. అక్టోబర్లో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి