iDreamPost
android-app
ios-app

Prabhas: ప్రభాస్ మూవీలో పాకిస్తాన్ భామ కాదు.. ఢిల్లీ డాల్ అట..!

  • Published Jul 23, 2024 | 8:44 PM Updated Updated Jul 23, 2024 | 8:44 PM

కల్కి మూవీతో మంచి జోష్ మీదున్నాడు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీలో ఉన్నాడు. అయితే హను రాఘవపూడితో నటించబోయే సినిమా కోసం హీరోయిన్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

కల్కి మూవీతో మంచి జోష్ మీదున్నాడు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీలో ఉన్నాడు. అయితే హను రాఘవపూడితో నటించబోయే సినిమా కోసం హీరోయిన్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

  • Published Jul 23, 2024 | 8:44 PMUpdated Jul 23, 2024 | 8:44 PM
Prabhas: ప్రభాస్ మూవీలో పాకిస్తాన్ భామ కాదు.. ఢిల్లీ డాల్ అట..!

సలార్, కల్కి 2898ఏడీ వరుస హిట్ల తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు వరుసగా మూవీస్ చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రస్తుతం ఆయన మూవీ లైనప్ చాలా పెద్దదిగానే ఉంది. సలార్ సీక్వెల్ శౌరాంగ్య పర్వంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, కల్కి సీక్వెల్‌తో పాటు సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో కూడా ఓ మూవీ కమిట్ అయ్యాడు. ఈ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు ప్రకటించడంతో అభిమానులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇదిలా ఉంటే.. హనురాఘవపూడి సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఫౌజీ అనే టైటిల్ పరిశీలనో ఉంది. 1940 బ్యాక్ డ్రాప్‌లో సాగే కథగా.. ప్రభాస్ ఓ సోల్జర్‌గా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.

అయితే ఈ మూవీ గురించి ఇటీవల ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. డార్లింగ్ ప్రభాస్‌కు జోడీగా పాకిస్తానీ ముద్దుగుమ్మ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. పాకిస్తాన్ బ్యూటీ సజల్ అలీ నటించనుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఓ బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆమెనే హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని వినిపిస్తోంది. అయితే ఇదంతా ఉత్తిదే అని క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ పక్కన నటించే గోల్టెన్ ఛాన్స్ కొట్టేసిందట ఢిల్లీ డాల్ ఇమాన్ ఇస్మాయెల్. యాక్టర్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ కూడా. ఆమె డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ బ్యూటీనే హను రాఘవపూడి ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సజల్ అలీ ట్రెండ్ కాగా, ఇప్పుడు ఇమాన్ ఇస్మాయెల్ పేరు గట్టిగా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. హను రాఘవపూడి, ఇమాన్ ఒకరినొకరు ఫాలో కావడంతో పాటు ఈమె ప్రభాస్‌ను కూడా ఇన్ స్టాలో ఫాలో కావడంతో అన్న పక్కన నటించే వదిన ఈమెనంటూ తెగ సంబరపడిపోతున్నారు ఈ గ్లోబల్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్స్. మరీ దీనిపై హను రాఘవపూడి క్లారిటీ ఇస్తే ఈ రూమర్స్ చెక్ పెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే కమిటైన ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాక హను రాఘవపూడి చిత్రంలో జాయిన్ కానున్నాడు రెబల్ స్టార్. వచ్చే నెలలో పూజా కార్యక్రమం జరగనున్నట్లు  చెబుతున్నారు సోషల్ మీడియా సైనికులు. ఇక ప్రభాస్ కల్కి మూవీ విషయానికి వస్తే.. ఇంకా ధియేటర్లలో సందడి చేస్తుంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా దుమ్ము రేపుతోంది. వసూళ్లలో ఆర్ఆర్ఆర్ మూవీని దాటేసింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom