iDreamPost
android-app
ios-app

సలార్ 2, స్పిరిట్ కన్నా ముందు పట్టాలెక్కనున్న ప్రభాస్‌ మూవీ.. ఏదంటే

  • Published Jul 26, 2024 | 3:53 PM Updated Updated Aug 02, 2024 | 2:28 PM

కల్కి 2898 ఏడీ హిట్టుతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. అయితే దీని తర్వాత ఏంటీ .. ఏ ప్రాజెక్ట్ మొదలౌతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ జరుగుతుండగా.. నెక్ట్స్ ఏ మూవీ చేయబోతున్నాడన్న ఉత్సుకత నెలకొంది. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

కల్కి 2898 ఏడీ హిట్టుతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. అయితే దీని తర్వాత ఏంటీ .. ఏ ప్రాజెక్ట్ మొదలౌతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ జరుగుతుండగా.. నెక్ట్స్ ఏ మూవీ చేయబోతున్నాడన్న ఉత్సుకత నెలకొంది. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

  • Published Jul 26, 2024 | 3:53 PMUpdated Aug 02, 2024 | 2:28 PM
సలార్ 2, స్పిరిట్ కన్నా ముందు పట్టాలెక్కనున్న ప్రభాస్‌ మూవీ.. ఏదంటే

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ మీదున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అలాగే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తానని ఫ్యాన్స్‌కు మాట ఇచ్చినట్లే.. ఆ హామీకి కట్టుబడినట్లు కనిపిస్తుంది. గత ఏడాది ఆదిపురుష్.. సలార్ చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేసేసిన డార్లింగ్. ఈ ఏడాది కల్కి 2898ఏడీతో కలెక్షన్లను ఊచకోత కోశాడు. ఇప్పటికే 1100 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ మూవీ.. తన హవా ఇంకా కొనసాగిస్తూనే ఉంది. సినిమా రిలీజై నెల రోజులు కావస్తున్నా.. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇక ఇందులో డార్లింగ్ కర్ణుడిగా, భైరవగా అలరించిన సంగతి విదితమే. ఈ సక్సెస్ ఎంజాయ్ చేయకుండానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షురూ చేశాడట ఈ గ్లోబల్ స్టార్.

ఇప్పుడు ప్రభాస్ మూవీ లైనప్ చూసి అభిమానులకు కడుపు నిండిపోతుంది. అందులో ఒకటి హను రాఘవపూడి మూవీ. ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్టేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న రాజా సాబ్‌లో నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో రెబలోడు సరికొత్తగా కనిపించబోతున్న సంగతి విదితమే. ఫక్కా ఫ్యామిలీ మ్యాన్ అట. ఇక వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోయబోతున్నాడు. తొలిసారిగా ఇందులో పవర్ ఫుల్ కాప్‌గా నటించనున్నాడట. ఇక సందీప్ తన మార్క్ చూపించనున్నాడట. అలాగే సలార్ 2 కూడా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత డార్లింగ్ జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

దీనితో పాటు హను రాఘవపూడి సినిమా కూడా స్టార్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ రెండింటి కన్నా ముందే ఇది మొదలు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సైనికుడిగా నటించబోతున్నట్లు గట్టిగా టాక్ నడుస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ప్రాజెక్ట్ ఆగ‌స్టు 17న ప్రారంభించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాను అదే రోజున షూటింగ్ ప్రారంభించాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్పైజే. ఇందులో కూడా ప్రేమ, యుద్ధం చుట్టూ కథ ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇది కూడా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతుందట. వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం హీరోయిన్ల వేట మొదలైన సంగతి విదితమే. ఇప్పటికే పాకిస్తాన్ భామ పేరు వినిపించగా.. అదంతా తూచ్.. ఢిల్లీ భామ ఫిక్స్ అయ్యిందన్న టాక్ నడిచింది. ఇదే కాకుండా కల్కి సీక్వెల్ కూడా రాబోతుంది. ఇప్పటికే ఇందులో 40 పర్సెంట్ షూటింగ్ పూర్తయినట్లు ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom