Prabhas, Hanu Raghavapudi Movie Update: ప్రభాస్, హను రాఘవపూడి మూవీ పట్టాలెక్కేది ఎప్పుడంటే !

ప్రభాస్, హను రాఘవపూడి మూవీ పట్టాలెక్కేది ఎప్పుడంటే !

Prabhas, Hanu Raghavapudi Movie Update: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం కల్కి మూవీ హైప్ లో ఉండగానే వరుస అప్ డేట్స్ తో అభిమానులను సర్పైజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ , హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన క్రేజి అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Prabhas, Hanu Raghavapudi Movie Update: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం కల్కి మూవీ హైప్ లో ఉండగానే వరుస అప్ డేట్స్ తో అభిమానులను సర్పైజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ , హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన క్రేజి అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కల్కి ఇచ్చిన హైప్ నుంచి అభిమానులు ఇంకా బయటక రాకముందే.. లైన్ అప్ ప్రాజెక్ట్ అప్ డేట్స్ తో అభిమానాలను సర్ప్రైజ్ చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్-2 , కల్కి-2 , స్పిరిట్ , రాజాసాబ్ ఇలా అన్ని భారీ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి. దీనితో ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ సినిమాలతో పాటు ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కాంబో కి సంబంధించి అడపా దడపా ఏవో ఒక అప్ డేట్స్ ప్రేక్షకులకు ఆ సినిమాపై ఇంట్రెస్ట్ ను కలిగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో.. హను రాఘవపూడి, ప్రభాస్ మూవీ రాబోతుంది. ఇప్పటికే హనురాఘవపూడి నుంచి వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ప్రేక్షకులను మెప్పించేశాయి. ఈ దర్శకుడి కథ , మేకింగ్ నటి నటులను చూపించే తీరు ఇలా ప్రతిదీ ప్రత్యేకంగానే నిలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే.. ప్రేక్షకులకు ఈసారి అంతకుమించిన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ లును పరిశీలిస్తున్నారట మేకర్స్. పైగా ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కథ కూడా ఉండబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా పూజ కార్య క్రమాలు ఆగష్టు 17 నుంచి నిర్వహించబోతున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని సమాచారం.

పైగా ప్రభాస్ అభిమానులను సంతోషపరిచే ఇంకొక న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని.. దాదాపు వచ్చే సంవత్సరం చివరికి.. ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ కొట్టేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఇప్పటికే ప్రభాస్ సినిమాలకు సంబంధించి వస్తున్న ప్రతీ అప్ డేట్ ప్రేక్షకులకు భారీ హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది. మరి ఈ మూవీ కి సంబంధించిన అప్ డేట్స్ సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments