iDreamPost
android-app
ios-app

Prabhas: వేల మందికి కోట్ల రూపాయలు సాయం! ప్రభాస్ నువ్వు నిజమైన రాజువయ్యా!

  • Published Jul 10, 2024 | 1:49 PMUpdated Jul 10, 2024 | 1:49 PM

Prabhas Help To Kalki Movie Members: ప్రభాస్‌ మంచి మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఆయన చేసిన కోట్ల రూపాయల సాయం గురించి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

Prabhas Help To Kalki Movie Members: ప్రభాస్‌ మంచి మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఆయన చేసిన కోట్ల రూపాయల సాయం గురించి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

  • Published Jul 10, 2024 | 1:49 PMUpdated Jul 10, 2024 | 1:49 PM
Prabhas: వేల మందికి కోట్ల రూపాయలు సాయం! ప్రభాస్ నువ్వు నిజమైన రాజువయ్యా!

ప్రభాస్‌ గురించి ఇండస్ట్రీలో ఎవరిని ప్రశ్నించినా సరే.. వారి ముఖంలోకి చిరునవ్వు వచ్చి చేరుతుంది. నిజంగానే డార్లింగ్‌ అని అంటారు. ఇక ప్రభాస్‌ చేసే దానాలు, సహాయాల గురించి బయటకు పెద్దగా తెలియదు కానీ.. ఇండస్ట్రీకి చెందిన ఎవరిని అడిగినా కథలు కథలుగా చెబుతారు. ఇక సినిమా సెట్స్‌లో తనతో ఉండే వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఆదరిస్తాడు. తనతో పని చేసిన ప్రతి ఒక్కరు ప్రభాస్‌ ఇంటి నుంచి వచ్చే భోజనం గురించి కచ్చితంగా కామెంట్స్‌ చేస్తారు. డార్లింగ్‌ది అంత మంచి మనసు కాబట్టే.. హీరోలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక తాజాగా కల్కి చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద దండ యాత్ర చేశాడు ప్రభాస్‌. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. రికార్డులు బద్దలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా కల్కి సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసిన వ్యక్తి.. ప్రభాస్‌ చేసిన సాయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ వార్త చదివిన అభిమానులు.. నువ్వు నిజమైన రాజువయ్యా అని ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

డార్లింగ్‌ ప్రభాస్‌ మంచితనం గురించి ఎవరిని అడిగినా కథలు కథలుగా చెబుతారు. బాక్సాఫీస్‌ కింగ్‌ అయినా సరే.. ఒదిగే ఉండే తత్వం ఆయన సొంతం. ఇక సాయమంటూ వచ్చిన వారిని ఆదుకుంటూ ఉంటారు. ఆయన చేసే సాయంగురించి ఎక్కడా ఎలాంటి ప్రచారం చేసుకోరు. ఈ క్రమంలో ప్రభాస్‌ దాన గుణం గురించి కల్కి సినిమాకు కాస్ట్యూమ్‌ డైరెక్టర్‌గా చేసిన మురళి అనే వ్యక్తి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కల్కి సినిమా కోసం పని చేసిన వేలాది మందికి ప్రభాస్‌ కోట్ల రూపాయల సాయం చేశాడట. పైగా సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభాస్‌ ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడట.

ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. ‘‘కల్కి సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రభాస్‌.. రూ.10 వేలు బహుమతిగా ఇచ్చారు. సినిమాకు పని చేసిన అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకుని.. వారి అకౌంట్‌లో 10 వేల రూపాయల చొప్పున జమ చేశారు. నా కెరీర్‌లో ఇంత వరకు ఇలాంటి హీరోను నేను చూడలేదు. అలానే కల్కి షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్‌ ఇంటి నుంచే అందరికి రుచికరమైన భోజనం తెప్పించే పెట్టేవాడు. నిజంగా డార్లింగ్‌ లాంటి హీరోను ఇంతవరకు నేను చూడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు మురళి. ఈ విషయం తెలిసిన ప్రభాస్‌ అభిమానులు ఇందుకు కదా నిన్ను రాజు అనేది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి