Japan Fans Came To Hyderabad For Watch Kalki 2898 AD: ఇది కదా ప్రభాస్‌ క్రేజ్‌.. కల్కి చూడ్డానికి జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు

Kalki 2898 AD Movie: ఇది కదా ప్రభాస్‌ క్రేజ్‌.. కల్కి చూడ్డానికి జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు

ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రభాస్‌ అభిమానులు జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అది కూడా కల్కి చూడ్డం కోసం. ఆ వివరాలు..

ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రభాస్‌ అభిమానులు జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అది కూడా కల్కి చూడ్డం కోసం. ఆ వివరాలు..

కల్కి ఈ పేరు ఇప్పుడు ప్రపంచ సినీ అభిమానులను ఊపేస్తుంది. చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే 7 వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మన సినిమాలకు ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున అభిమానులున్నారు. మరీ ముఖ్యంగా జపాన్‌ వాసులు మన సినిమాలంటే విపరీతమైన ఆసక్తి చూపుతారు. బాహుబలి సినిమా తర్వాత ఈ క్రేజ్‌ మరింత పెరిగింది. ఇక ఈ మూవీ తర్వాత నుంచి డార్లింగ్‌ ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. సాధారణంగానే మన దేశంలో ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా.. మూవీ లవర్స్‌ అందరూ ప్రభాస్‌ను అభిమానిస్తారు. ఇక ఈ జాబితాలో జపాన్‌ వాసులు కూడా చేరారు. ఇక అక్కడ డార్లింగ్‌ క్రేజ్‌ ఎలా ఉందంటే.. కల్కి సినిమా చూడ్డం కోసం కొందరు ఏకంగా జపాన్‌ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చారు. ఆ వివరాలు..

ప్రభాస్‌ ప్రస్తుతం ఈ పేరు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో సైతం మార్మోగిపోతుంది. బాహుబలితో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌.. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. బాహుబలి తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. బాహుబలి నుంచి ఇది మొదలైంది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కల్కి 2898 ఏడీతో మరోసారి లోకల్ టు గ్లోబల్‌గా తన స్టార్‌డమ్‌ను చాటుకున్నారు ప్రభాస్‌. ఈ క్రమంలో తాజాగా జపాన్‌ నుంచి కొందరు అభిమానులు హైదరాబాద్‌ వచ్చారు.. అది కూడా డార్లింగ్‌ కల్కి సినిమా చూసేందుకు. ఈ విషయం తెలిసిన వారు.. ఇది కదా ప్రభాస్‌ రేంజ్‌ అంటున్నారు.

కల్కి సినిమా చూడటం కోసం ప్రభాస్‌ అభిమానులు కొందరు జపాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి.. నగరంలోని ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారు, ప్రభాస్ కటౌట్‌తో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఈ విషయాన్ని.. జపాన్‌ అభిమానుల ఫొటోలను వైజయంతి మూవీస్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇది కదా మా డార్లింగ్‌ రేంజ్‌ అంటున్నారు. ఇక కల్కి 2898 ఏడీ సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభాస్‌ సినిమా అంటే ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ మొదలవుతుంది. బహుబలి, సలార్ తర్వాత కల్కి 2898 ఏడీ సినిమాతో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్‌. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ యుగాంతాన్ని భారతీయ పురాణాలతో లింక్‌ చేస్తూ.. తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు.. ఇండియాలోనే దిగ్గజ నటులైన అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాససన్‌ కీలక పాత్రల్లో నటించారు.

Show comments