iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్?

  • Author ajaykrishna Published - 08:32 AM, Fri - 28 July 23
  • Author ajaykrishna Published - 08:32 AM, Fri - 28 July 23
డార్లింగ్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్?

ఇండస్ట్రీలో ఒక్కోసారి సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతుంటాయి. అది ఇన్ స్టాగ్రామ్ అవ్వొచ్చు లేదా ఫేస్ బుక్ కావచ్చు. కానీ.. హ్యాక్ కి గురైతే.. సెలబ్రిటీలు రెగ్యులర్ గా పోస్ట్ చేసేవి కాకుండా వాళ్లకు తెలియని వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అయ్యిందనే అంటున్నారు ఫ్యాన్స్. అదేంటి.. ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. గురువారం రాత్రి ప్రభాస్ ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ అయింది. ‘అన్ లక్కీ హ్యూమన్స్’ అనే ట్యాగ్ తో ఆ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కూడా అన్ని షాకింగ్ విజువల్స్ ఉండటం గమనార్హం.

రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్న వ్యక్తులు.. పనిలో ఉన్నవారు.. ఏవేవో సాహసాలు చేస్తున్నవారు.. ఇలా కొన్ని వీడియోస్ అన్ని కలిపి ఆ వీడియో రెడీ చేశారు. సుమారు 2:49 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియో.. ప్రభాస్ ఫేస్ బుక్ లో పోస్ట్ అయ్యిందిగానీ.. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం కాలేదు. దీంతో ప్రభాస్ ఫేస్ బుక్ చూసిన ఫ్యాన్స్.. అకౌంట్ హ్యాక్ అయ్యిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభాస్ టీమ్ ఆ వీడియో ఇష్యూని తొలగించి.. సమస్యను సాల్వ్ చేయాలనీ కోరుతున్నారు. మరోవైపు పాన్ ఇండియా వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంపై రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ సోషల్ మీడియా టీమ్ అయితే ఇంకా యాక్టీవ్ లోకి రాలేదు.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ సోషల్ మీడియాను వాడడమే చాలా రేర్. ఎప్పుడో ఓ పోస్ట్ సినిమాల గురించి మాత్రమే పెడుతుంటాడు. అలాంటిది ఇప్పుడిలా సంబంధం లేని వీడియోస్ దర్శనం ఇవ్వడం షాకిస్తున్న విషయం. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే.. వాటిలో ముందుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ తెరపైకి రాబోతుంది. సెప్టెంబర్ 28న సలార్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ కి ఇది కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. మరోవైపు సలార్ కాకుండా కల్కి 2898 AD, మారుతీతో ఓ సినిమా.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఒక్కో సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. మరి డార్లింగ్ ఫేస్ బుక్ హ్యాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbahiks girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio