iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి వంగా గ్రాండ్ ప్లానింగ్.. ప్రభాస్ డ్యూయల్ రోల్ ?

  • Published Oct 16, 2024 | 1:30 PM Updated Updated Oct 16, 2024 | 1:30 PM

Spirit Movie: సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో ఓ మూవీ తీస్తున్న సంగతి తెలియనిది కాదు. అయితే ఈ సినిమా కోసం సందీప్ ఎదో గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Spirit Movie: సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో ఓ మూవీ తీస్తున్న సంగతి తెలియనిది కాదు. అయితే ఈ సినిమా కోసం సందీప్ ఎదో గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Oct 16, 2024 | 1:30 PMUpdated Oct 16, 2024 | 1:30 PM
సందీప్ రెడ్డి వంగా గ్రాండ్  ప్లానింగ్.. ప్రభాస్ డ్యూయల్ రోల్ ?

సందీప్ రెడ్డి వంగా.. తీసింది కొన్ని సినిమాలే అయినా  తన కథలపై మాత్రం అందరికి నమ్మకం కుదిరింది. ఈ దర్శకుడు తానూ అనుకున్న కథను క్లియర్ గా తెరపై చూపించడంలో ఆరితేరిపోయాడు. యానిమల్ సినిమా చూస్తే ఈ విషయం అందరికి అర్ధమౌతుంది. కంటెంట్ ను బలమైన క్యారెక్టర్స్ తో ఎలివేట్ చేయడంలో సందీప్ దిట్ట. దీనితో ఈ దర్శకుడితో సినిమా తీయాలని బడా హీరోలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే.. మూవీ గురించి బజ్ బాగా వినిపిస్తుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కట్ అవుట్.. సందీప్ లాంటి డైరెక్టర్ కు దొరికితే.. ఇక సినిమా అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో గెస్ చేయొచ్చు . కానీ సందీప్ మాత్రం ఎవరు ఊహించని విధంగా డార్లింగ్ ను చూపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ బడ్జెట్ 500 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 1000 కోట్లకు చేరింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు.. ఆల్రెడీ సందీప్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ బాహుబలిలో ప్రభాస్ తండ్రి కొడుకుల గెట్ అప్ లో నటించాడు. కానీ అక్కడ ఆ రెండు క్యారెక్టర్స్ ఒకేసారి ఎదురుపడవు. కానీ స్పిరిట్ లో మాత్రం ప్రభాస్ డ్యూయల్ రోల్ ను ఒకేసారి స్క్రీన్ మీద చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట సందీప్. దాని కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు తెలుస్తుంది. మామూలుగానే ప్రభాస్ సినిమాలకు ఓ రేంజ్ లో హైప్ కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది సందీప్ లాంటి డైరెక్టర్ తో మూవీ , పైగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక అభిమాలకు పండగే. మరో రెండేళ్ల వరకు ఈ సినిమా అయితే రాదు. కానీ ఈలోపు వచ్చే అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే, ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ యాక్టర్ ను దింపుతున్నారని .. అంతే కాకుండా కొరియా , చైనీస్ స్టార్స్ ను కూడా తీసుకుని వస్తున్నారని సమాచారం. ఇక ఎలాగూ సందీప్ కు బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. ఆ యాక్టర్స్ ను కూడా సినిమాలో ఉపయోగించే అవకాశం లేకపోలేదు. రన్ బీర్ కూడా సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సో ఇప్పుడే ఇలాంటి హైప్ ఉంటే.. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ హైప్ పెంచుతాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. త్వరలోనే మేకర్స్ స్పిరిట్ కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రభాస్ తో పాటు .. ప్రభాస్ అభిమానులకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే చాలా కాలం తర్వాత డార్లింగ్ వింటేజ్ లుక్ లో దర్శనం ఇవ్వనున్నాడు. ఇది పూర్తైన వెంటనే.. సందీప్ మూవీ పట్టాలెక్కేస్తుంది. ఆ తర్వాత ప్రభాస్ చేయాల్సిన మూవీస్ లిస్ట్ ఉండనే ఉంది. ఇక స్పిరిట్ లో సందీప్ ప్రభాస్ ను ఏ విధంగా మేక్ ఓవర్ చేసి చూపిస్తాడో చూడాలి. మరి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss