iDreamPost
android-app
ios-app

ఒకేసారి మూడు సినిమాలు.. అసలు ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడు?

  • Published Nov 08, 2024 | 5:47 PM Updated Updated Nov 08, 2024 | 5:47 PM

Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ లైన్ అప్ చూస్తే ఒక్కొక్కరికి మతి పోతుంది. అసలు ఈ లైన్ అప్ ఏంటి సామి అంటూ అందరు నోటి మీద వేలు వేసుకుంటున్నారు . ఇక ఫ్యూచర్ లో సినిమాలు ఎలా మ్యానేజ్ చేస్తాడా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ లైన్ అప్ చూస్తే ఒక్కొక్కరికి మతి పోతుంది. అసలు ఈ లైన్ అప్ ఏంటి సామి అంటూ అందరు నోటి మీద వేలు వేసుకుంటున్నారు . ఇక ఫ్యూచర్ లో సినిమాలు ఎలా మ్యానేజ్ చేస్తాడా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

  • Published Nov 08, 2024 | 5:47 PMUpdated Nov 08, 2024 | 5:47 PM
ఒకేసారి మూడు సినిమాలు..  అసలు ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడు?

ఏడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు. రెండు కూడా బాక్స్ ఆఫీస్ ను ఒక ఆట ఆడించాయి. ఇప్పటివరకు ఆ రికార్డ్స్ ను టచ్ చేసే సినిమా మరొకటి లేదు. ఇలా రెండు భారీ బడ్జెట్ సినిమాలు వెంట వెంటనే రిలీజ్ చేయాలంటే.. దాని వెనుక కచ్చితంగా డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ముఖ్యంగా వాటి వెనుక ఆరడుగుల కట్ అవుట్ ప్రభాస్ ఉండాలి. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు.. చాలా బిజియస్ట్ స్టార్ కూడా. ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ ను పెంచే సినిమాలే. మల్టిపుల్ మూవీస్ తో బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్. రాజాసాబ్ , ఫౌజీ సినిమాలను దాదాపు వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సో ఈ లోపే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తవ్వాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒకేసారి రెండు సినిమాలలో పాల్గొనడమే విశేషం అనుకుంటే.. ఇప్పుడు స్పిరిట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. రెండు సినిమాలలో అయితే మ్యానేజ్ చేయొచ్చు. కానీ ఒకేసారి మూడు సినిమాలలో అసలు ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడు. మూడో సినిమా స్పిరిట్ అని అందరికి తెలుసు. కానీ అప్పుడే స్పిరిట్ ఏంటా అని అనుకుంటున్నారా.

నిజానికి స్పిరిట్ మూవీ ఏడాది క్రితమే కమిట్ అయ్యాడు ప్రభాస్. అర్జున్ రెడ్డి , యానిమల్ చూసాక సందీప్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ యాడ్ అయ్యే సరికి.. అవి ఇంకాస్త బలపడ్డాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్చర్య పరిచేలా ఈ సినిమా ఈ డిసెంబర్ లోనే షూటింగ్ లోకి వెళ్లబోతుందని సమాచారం. తాజాగా స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ షూటింగ్ అప్డేట్ ను ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలో నటి నటుల ఎంపిక జరుగుతుందని చెప్పుకొచ్చారు. సాధారణంగా సందీప్ స్క్రిప్ట్ , షూటింగ్ విషయాల్లో మరీ అంత హడావిడి పడే రకం అయితే కాదు. సో రాజాసాబ్ , ఫౌజీ తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవ్వొచ్చని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు సందీప్ కూడా సినిమా మొదలుపెట్టనున్నాడు. ఓ వైపు రాజా సాబ్ , ఓ వైపు ఫౌజీ , మరో వైపు స్పిరిట్ . ఈ మూడు సినిమాలకు డిఫరెంట్ లుక్స్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకేసారి మూడు సినిమాలను ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేయగలడు అని అంతా ఆలోచిస్తున్నారు. బహుశా ముందు వేరే నటి నటులతో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ప్రభాస్ తో షూట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ విన్న డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇవన్నీ రేబలోడికి వెన్నతో పెట్టిన విద్య.. చాలా ఈజీగా చేసేయగలడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్పిరిట్ కంప్లీట్ అయితే వెంటనే సలార్-2, కల్కి-2 చిత్రాలు వెయిటింగ్ లో ఉన్నాయి. మొత్తానికి ఇది ప్రభాస్ కు మాత్రమే సాధ్యం అనిపించుకుంటున్నాడు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Giriş