iDreamPost
android-app
ios-app

రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కు గ్రాండ్ బర్త్ డే గిఫ్ట్ .. ఏకంగా 4 మూవీస్!

  • Published Oct 17, 2024 | 11:13 AM Updated Updated Oct 17, 2024 | 11:13 AM

Prabhas Birthday Special Movies: రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ హీరో కు పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది. మరి డార్లింగ్ బర్త్ డే వస్తుందంటే ఆ హడావిడి మాములుగా ఉండదు. ఈ క్రమంలోనే ప్రభాస్ బర్త్ డే కు గ్రాండ్ గిఫ్ట్ ను ప్లాన్ చేశారు మేకర్స్.దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Prabhas Birthday Special Movies: రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ హీరో కు పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది. మరి డార్లింగ్ బర్త్ డే వస్తుందంటే ఆ హడావిడి మాములుగా ఉండదు. ఈ క్రమంలోనే ప్రభాస్ బర్త్ డే కు గ్రాండ్ గిఫ్ట్ ను ప్లాన్ చేశారు మేకర్స్.దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 17, 2024 | 11:13 AMUpdated Oct 17, 2024 | 11:13 AM
రెబెల్ స్టార్  ఫ్యాన్స్ కు గ్రాండ్ బర్త్ డే గిఫ్ట్ .. ఏకంగా 4 మూవీస్!

స్టార్ హీరోల పుట్టిన రోజులు వస్తున్నాయాంటే చాలు.. అభిమానులు ఎదో ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్ కానీ , టీజర్ కానీ ఇలా ఎదో ఒక అప్డేట్ వస్తే చాలనుకుంటారు. మేకర్స్ కూడా అభిమానుల కోరికకు తగినట్లే.. అప్డేట్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక పండుగల సమయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది.  రెబెల్ స్టార్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోలకు ఈ క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో హై స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రాధేశ్యాం మూవీ ఆలస్యం కావడంతో.. ఆ గ్యాప్ ను ఇప్పుడు ఫిల్ చేసేస్తున్నాడు. ఇక మరో వారం రోజుల్లో డార్లింగ్ బర్త్ డే ఉంది. దీనితో ఈసారి బర్త్ డే హడావిడి మాములుగా లేదు. ఈ క్రమంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభాస్ సినిమాలను రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎదో పాత సినిమా రిలీజ్ అయిందిలే ఏముంటుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాలతో పాటు
రీరిలీజ్ సినిమాలు కూడా కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి . ఇక స్టార్ హీరోల బర్త్ డేస్ కు కొత్త సినిమాల అప్డేట్స్ తో పాటు.. వారి పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇదే ఇప్పటి ట్రెండ్. అభిమానులకు కూడా ఇది కాస్త రిఫ్రెషింగ్ ఫీల్ ను ఇస్తుంది. ఈ క్రమంలోనే డార్లింగ్ బర్త్ డే కు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయనున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా బర్త్ డే కు ఒకటి రెండు సినిమాలను రీరిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ మొత్తం నాలుగు సినిమాలు రీరిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అందులో ప్లాప్ సినిమాలు కూడా ఉండడం విశేషం. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే. సో దానికి రెండు రోజుల ముందు నుంచే ఈ హడావిడి స్టార్ట్ కానుంది. అక్టోబర్ 19,20 తేదీల్లో ఆరేళ్ళ తర్వాత డార్లింగ్ ఊచకోత కోసిన సలార్ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. అలాగే 22 న మిస్టర్ పర్ఫెక్ట్ , 23న ఈశ్వర్ ఆ తర్వాత రెబెల్ సినిమాలను రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాలు కాకుండా.. ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న సినిమాలు రాజాసాబ్ , స్పిరిట్. వచ్చే ఏడాది ఎలా అయినా ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో రాజాసాబ్ మూవీ నుంచి టీజర్ , స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇలా డార్లింగ్ ఫ్యాన్స్ కు గ్రాండ్ గా బర్త్ ట్రీట్ ఇస్తున్నాడు. కచ్చితంగా ఇది ప్రభాస్ కు బెస్ట్ బర్త్ డే అవ్వడం ఖాయం. మరి రీరిలీజ్ చేసే సినిమాలలో ఏ సినిమా ఎలాంటి ట్రెండ్ ను సెట్ చేస్తుందో చూడాలి. అయితే ఒకేసారి అన్ని సినిమాలు రిలీజ్ చేయడం అవసరమా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏమౌతుందో చూడాలి. ఇక ఇప్పటికే ప్రభాస్ కొత్త సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమాల నుంచి రాబోయే అప్డేట్స్ ఎలాంటి హైప్ పెంచుతాయా అని అంతా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetKavbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişgrandbetting girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/galabetcasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş