iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అంటున్న ప్రేక్షకులు.. ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌!

  • Published Jun 16, 2023 | 11:39 AM Updated Updated Jun 16, 2023 | 11:39 AM
  • Published Jun 16, 2023 | 11:39 AMUpdated Jun 16, 2023 | 11:39 AM
ఆదిపురుష్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అంటున్న ప్రేక్షకులు.. ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆదిపురుష్‌ చిత్రం.. జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతుండటం, ప్రభాస్‌ రాఘవుడి పాత్రలో కనిపించనుండటంతో.. ఆదిపురుష్‌ సినిమా మీద దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ మొదలయ్యింది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూశారు. అనేక అవాంతరాలను దాటుకుని.. ఆదిపురుష్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామునే బెనిఫిట్‌ షోలు వేశారు. ఏ థియేటర్‌ వద్ద చూసిన జై శ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తిస్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఇక ట్విట్టర్‌లో ఆదిపురుష్‌ ట్రెండింగ్‌లో ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ పక్కా అని.. నిజంగానే సినిమా విజువల్‌ వండర్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

రాఘవుడి పాత్రలో ప్రభాస్‌ ప్రాణం పెట్టి నటించారని.. సీత పాత్రలో కృతి సనన్‌ ఒదిగిపోయారని.. పోరాట దృశ్యాలు అద్భుతం అని.. ఈ తరానికి నచ్చేలా.. ఆదిపురుష్‌ సినిమాను తెరకెక్కించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ చూశామని, చాలా డీసెంట్‌గా ఉందంటున్నారు. సినిమాలో డ్రామా పార్ట్, మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. వి.ఎఫ్.ఎక్స్ మాత్రం గొప్పగా లేదని చెబుతున్నారు. ట్విట్టర్‌లో పాజిటివ్‌ రివ్యూ రావడంతో.. ఆదిపురుష్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవ్వడం పక్కా అని.. తొలి రోజే 100 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేస్తుంది అని సినీ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet