iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే భర్తతో ప్రముఖ నటి విడిపోయిందంటూ వార్తలు

  • Published Feb 13, 2024 | 5:47 PM Updated Updated Feb 14, 2024 | 12:59 PM

బాయ్ ఫ్రెండ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు సడెన్ స్ట్రోక్ ఇచ్చింది ఆ నటి. పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక నటించేది లేదంటూ చెప్పేసింది. కానీ అంతలో నటిగా ప్రత్యక్షమైంది. దీంతో డివోర్స్ అంటూ..

బాయ్ ఫ్రెండ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు సడెన్ స్ట్రోక్ ఇచ్చింది ఆ నటి. పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక నటించేది లేదంటూ చెప్పేసింది. కానీ అంతలో నటిగా ప్రత్యక్షమైంది. దీంతో డివోర్స్ అంటూ..

  • Published Feb 13, 2024 | 5:47 PMUpdated Feb 14, 2024 | 12:59 PM
పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే భర్తతో ప్రముఖ నటి విడిపోయిందంటూ వార్తలు

సినీ సెలబ్రిటీలు ఇలా పెళ్లి చేసుకుంటున్నారో లేదో అలా విడిపోతున్నారు. వీరి కాపురం మూడు నాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. కొన్ని జంటలు విడిపోయామని అనౌన్స్ చేయగానే అభిమానులు షాక్‌‌కు గురౌతున్నారు. సమంత-నాగ చైతన్య, ఐశ్వర్య-ధనుష్ జంటలు విడిపోయిన విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న మెగా ఫ్యామిలీ నట వారసురాలు నిహారిక సైతం.. తన భర్తతో తెగదెంపులు చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు మరో నటి కూడా ఆ బాటలోనే నడుస్తుంది. ఈమె పెళ్లి చేసుకోవడం ఓ సస్పెన్స్ అయితే.. విడిపోవడం కూడా అంతే సెన్సేషన్ సృష్టిస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..

టాలీవుడ్ ఇంటి నుండి తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన సినీ, సీరియల్ యాక్ట్రెస్ ప్రియాంక నల్కరి. ఈ తెలుగు అమ్మాయి.. ఎస్ఎంఎస్, అందరి బంధువయ్య, సంథింగ్ సంథింగ్, కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి, వైఫ్ ఆప్ రామ్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెను దగ్గర చేసింది మాత్రం బుల్లితెర. టాలీవుడ్ వెండితెరలోనే కాదూ.. బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్, షోస్ చేసింది. ఆహ్వానం, మేఘమాల, మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ మేఘాలు వంటి సీరియల్స్ చేసింది. ఈటీవీ, జెమినీ, జీ తెలుగు ఇలా అనేక షోల్లో పార్టిసిపెంట్‌గా వచ్చి సందడి చేసింది. ఇక్కడే కాదూ.. ఆమెకు కోలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తమిళంలో చేసిన రోజా సీరియల్ ఆమెను ఒక్కసారిగా ఫేమస్ చేసేసింది. సన్ టీవీలో నాలుగేళ్ల పాటు మంచి రివ్యూస్, రేటింగ్ రాబట్టుకుంది ఈ సీరియల్. నటి ప్రియాంక కన్నా.. రోజాగానే ఆమెకు మంచి గుర్తింపు ఉంది అక్కడ. 2023లో సీతారా రామన్ అనే సీరియల్ చేస్తుండగానే.. సడెన్‌గా పెళ్లి చేసుకుంది. మలేషియాలో తన భాయ్ ఫ్రెండ్ రాహుల్‌ను అత్యంత సాదా సీదాగా వివాహం చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది. మలేషియాలో సెటిల్ అయిపోవడంతో ఇకపై సీరియల్లో నటించనని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు జీ తమిళంలో నల దమయంతి సీరియల్ చేస్తుంది.

దీంతో ఆశ్చర్యానికి గురైన అభిమానులు.. ఏమైందా అని ఆలోచనలో పడ్డారు. అంతలో సోషల్ మీడియా నుండి ఆమె భర్త ఫోటోలు తీసేయడంతో పాటు కొన్ని విషాదకరమైన పోస్టులు పెడుతోంది. దీంతో కొన్ని రోజుల నుండి ప్రియాంకపై ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. మీరిద్దరూ విడిపోయారా అంటూ అడగడంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్ స్టా వేదికగా.. నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్ ఒంటరిగా ఉన్నారా ప్రశ్నకు.. అవును అని బదులు ఇచ్చింది. అయితే వీరెందుకు విడిపోయారో మాత్రం వెల్లడించలేదు. అయితే వీరి కాపురం సంవత్సరం కాకుండానే కంచికి చేరింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet