iDreamPost
android-app
ios-app

కన్నడ స్టార్ నటుడు ధృవ సర్జా మేనేజర్ అరెస్టు.. ఎందుకంటే..?

  • Published Sep 10, 2024 | 6:48 PM Updated Updated Sep 10, 2024 | 6:48 PM

కన్నడ ఇండస్ట్రీ వరుస వివాదాల్లో చిక్కకుంటుంది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రగౌడలు అరెస్టు కాగా, శాండిల్ వుడ్ షాక్ కు గురైంది. అంతలోనే ప్రముఖ నటుడు ధృవ సర్జా మేనేజర్ అరెస్టు అయ్యాడు.

కన్నడ ఇండస్ట్రీ వరుస వివాదాల్లో చిక్కకుంటుంది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రగౌడలు అరెస్టు కాగా, శాండిల్ వుడ్ షాక్ కు గురైంది. అంతలోనే ప్రముఖ నటుడు ధృవ సర్జా మేనేజర్ అరెస్టు అయ్యాడు.

  • Published Sep 10, 2024 | 6:48 PMUpdated Sep 10, 2024 | 6:48 PM
కన్నడ స్టార్ నటుడు ధృవ సర్జా మేనేజర్ అరెస్టు.. ఎందుకంటే..?

ఈ మధ్య కాలంలో సినిమాలతో కన్నా.. వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది శాండిల్ వుడ్ ఇండస్ట్రీ. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణలపై రేణుకా స్వామిని హత్య చేసి జైలుపాలయ్యాడు కన్నడ సూపర్ స్టార్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప. ఆ తర్వాత లెజెండరీ హీరో రాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్ డివోర్స్ విషయం రచ్చ రచ్చ అయ్యింది. ఇప్పుడు మరో స్టార్ పేరు అనుకోకుండా వివాదంలోకి వచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా పేరు వినిపిస్తుంది. ఆయన మేనేజర్ అశ్విన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ధృవ సర్జా జిమ్ ట్రైనర్ ప్రశాంత్ పూజారి దాడి నిర్వహించడంతో బనశంకరి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

మూడు నెలల క్రితం అంటే మే 26న కనకపురానికి చెందిన హర్ష, సుభాష్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రశాంత్ పూజారిపై దాడి చేశారు. దీంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ పని చేయించింది ధృవ సర్జా మేనేజర్ అశ్విన్ అని తెలిసి అతడ్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. కేవలం ఇగో వల్ల ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. జిమ్ ట్రైనర్ ప్రశాంత్.. ధృవ మధ్య క్లోజ్ నెస్ పెరిగిపోవడంతో తట్టుకోలేక పోయిన అశ్విన్, హీరో కారు డ్రైవర్ నాగేంద్ర.. అతడి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో హర్ష, సుభాష్‌లతో దాడి చేయించారు. కాగా, పోలీసులు ఈ ఇద్దర్ని పట్టుకుని ఉతికితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, కారు డ్రైవర్ నాగేంద్ర.. ధృవకు చిన్నప్పటి నుండి మంచి స్నేహితుడని తెలుస్తుంది.

అశ్విన్ చెప్పుడు మాటలు చెప్పడం వల్లే.. నాగేంద్రకు కోపం వచ్చి.. ఈ దాడికి పాల్పడేలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, గత ఏడాది అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా ధృవ సర్జా అతనికి కాస్ట్లీ టయోటా ఫార్చూనర్ కారును బహుమతిగా ఇచ్చాడు. అంతలోనే మరొకరికి దగ్గరవుతున్నాడన్న ఉద్దేశంతో అతడిపై దాడి చేయించాడు అశ్విన్. ప్రస్తుతం అతడు బెయిల్ పై విడుదలయ్యాడు. రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన దర్శన్, పవిత్ర గౌడల వార్తల నుండి తేరుకోని కన్నడిగులకు ఇప్పుడు ఈ పరిణామం చర్చకు తావునిచ్చినట్లయింది. ఇక ధ్రువ సర్జా సినిమాల విషయానికి వస్తే.. మార్టిన్ అనే పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎపి అర్జున్ దర్శకత్వంలో వాసవి ఎంటర్ ప్రెజెస్, ఉదయ్ కె మెహతా ప్రొడక్షన్స్ పతాకాలపై ఈ మూవీ తెరకెక్కుతంది. వైభవి శాండిల్య హీరోయిన్. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ఓ లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్ చసింది చిత్ర యూనిట్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet