iDreamPost
android-app
ios-app

Poonam Pandey: వీడియో: జనాలను ఫూల్స్ చేస్తానని ముందే చెప్పిన పూనమ్ పాండే..!

  • Published Feb 03, 2024 | 11:33 AM Updated Updated Feb 03, 2024 | 11:33 AM

నిన్నటి నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉందంటే.. బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మరణ వార్త. పూనమ్ చనిపోయిందంటూ ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి పోస్టు రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఫ్యాన్స్.. అయితే..

నిన్నటి నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉందంటే.. బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మరణ వార్త. పూనమ్ చనిపోయిందంటూ ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి పోస్టు రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఫ్యాన్స్.. అయితే..

  • Published Feb 03, 2024 | 11:33 AMUpdated Feb 03, 2024 | 11:33 AM
Poonam Pandey: వీడియో: జనాలను ఫూల్స్ చేస్తానని ముందే చెప్పిన పూనమ్ పాండే..!

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నటి కమ్ మోడల్ పూనమ్ పాండే. కాంట్రవర్సీ వ్యాఖ్యలతో, పొదుపుగా దుస్తులు ధరిస్తూ.. ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటే ఈమె మరణ వార్త కూడా అదే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు నటి ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించారు ఆమె టీం. అయితే పూనమ్ మరణ వార్త రాగానే సెలబ్రిటీలు షాక్ కు గురై.. రిప్ (రెస్ట్ ఇన్ పీస్) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుందని, ఇది ఫేక్, ఫన్ పోస్టు అని, ఇదొక స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మొన్నటి వరకు ఆమె బాగానే ఉంది కదా.. ఇప్పుడేంటీ ఇంత సడెన్‌గా అంటూ పూనమ్ బతికే ఉందంటున్నారు.

అయితే పూనమ్ మృతదేహం కానీ, ఇతర వివరాలు కానీ.. ఆమె భౌతిక కాయాన్ని నివాళులు అర్పించినట్లు గానీ ఎవ్వరూ చెప్పకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకు పూనమ్ అప్పుడేమందంటే.. ‘త్వరలో ఓ పెద్ద వార్త మీ ముందుకు రాబోతుంది. ప్రజలను సర్ ప్రైజ్ చేయడమంటే నాకెంతో ఇష్టం. నేను మారాను అని ప్రజలు భావించినప్పుడు.. వారిని మరింత ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను. కాబట్టి.. అతి పెద్ద వార్త వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించింది ఈ కాంట్రవర్సీ క్వీన్. ఇది చూసిన చాలా మంది మిక్స్ డ్ రియాక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు.

కావాలనే జనాలను ఫూల్స్ చేసే ఉద్దేశంతో ఇలాంటి ఫేక్ న్యూస్ రిలీజ్ చేసిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేనితోనైనా ఫ్రాంక్ చేయొచ్చు కానీ.. చావుతో చేయడం సరికాదంటున్నారు. అయితే ప్రజలను గొర్రెలు చేయడం..ఆమె వైపు చూపు తిప్పుకునేలా చేయడం పూనమ్ కు కొత్త కాదూ. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలిస్తే దుస్తులు విప్పి గ్రౌండ్ లో తిరుగుతానంటూ హాట్ కామెంట్స్ చేసింది. అంతేనా సోషల్ మీడియాలో తన వేషధారణతో చెమటలు పుట్టిస్తూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను పెళ్లిచేసుకున్న కొన్ని రోజుల్లోనే గృహ హింస కేసులు పెట్టి అరెస్టు చేయించింది. ఆ తర్వాత కలిసిపోయామంటూ పేర్కొంది. ఆమె చెప్పేది నిజమో,అబద్దమో తేల్చుకోలేని స్టేటాఫ్ మైండ్‍లో ఉన్నారు జనాలు.

ఏదేమైనా ఆమె కుటుంబం నుండి అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలియదు. అయితే ఆమె మేనేజర్ నికితాను ఓ వార్త సంస్థ సంప్రదించగా. ’ఉత్తరప్రదేశ్‍లోని పూనమ్ నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యుల నుండి కాల్ వచ్చింది. కానీ ఆ తర్వాత మేం వారిని కాంటాక్ట్ చేసినా.. అటు నుండి స్పందన లేదు. అందుకే మేము అధికారిక ప్రటకన విడుదల చేయడం లేదు. ఆమె ఇకలేరు. పూనమ్ భౌతిక కాయం యుపిలో ఉందని తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు. మరీ ఈ వార్తలను బట్టి, ఆమె నిజంగానే చనిపోయిందా.. లేక ఫ్రాంకా, ఏదైనా గర్భాశయ క్యాన్సర్ గురించి ఎవర్ నెస్ క్యాంపెయిన్ చేస్తుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మీకు అలానే అనిపించిందా..?

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss