iDreamPost
android-app
ios-app

Poonam Pandey: పూనమ్‌ పాండే తెలుగులో నటించిన సినిమా ఏదో తెలుసా?

  • Published Feb 02, 2024 | 3:33 PM Updated Updated Feb 02, 2024 | 3:33 PM

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే మృతి చెందింది. అయితే ఆమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. ఇంతకు ఆ సినిమా ఏది.. దానిలో హీరో ఎవరంటే..

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే మృతి చెందింది. అయితే ఆమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. ఇంతకు ఆ సినిమా ఏది.. దానిలో హీరో ఎవరంటే..

  • Published Feb 02, 2024 | 3:33 PMUpdated Feb 02, 2024 | 3:33 PM
Poonam Pandey: పూనమ్‌ పాండే తెలుగులో నటించిన సినిమా ఏదో తెలుసా?

వివాదాలతో బాలీవుడ్‌లోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి పూనమ్‌ పాండే. నిన్నటి వరకు మీడియా, సోషల్‌ మీడియాలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన ఈ భామ.. ఉన్నట్లుండి మృత్యువాతపడింది. ఫిబ్రవరి 1, గురువారం నాడు పునమ్‌ పాండే ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో చనిపోయింది. గర్భశాయ క్యాన్సర్‌తో పూనమ్‌ మృతి చెందినట్లు.. ఆమె సోషల్‌ మీడియా అకౌంట్స్‌ మేనేజర్‌.. శుక్రవారం నాడు పోస్ట్‌ చేశాడు. ఈ వార్త తెలిసి ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇప్పటికి చాలా మంది ఈ న్యూస్‌ని నమ్మడం లేదు. కానీ ఆంగ్ల మీడియా వెబ్‌సైట్స్‌, చానల్స్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. దాంతో ఆమె అభిమానులు పూనమ్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో పూనమ్‌ పాడే నటించిన తెలుగు సినిమా గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి చాలా మంది ఏంటి పూనమ్‌ తెలుగు సినిమాలో కూడా యాక్ట్‌ చేసింది.. ఇంతకు ఏ సినిమా.. హీరో ఎవరు అని తెగ సర్చ్‌ చేస్తున్నారు. ఇంతకు పూనమ్‌ నటించిన తెలుగు సినిమా ఏదంటే.. మాలిని అండ్‌ కో. 2015లో వచ్చిన ఈ సినిమాలో నటుడు సామ్రాట్ హీరోగా నటించాడు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది ఈ సినిమా. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ పూనమ్ గ్లామర్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈసినిమా తర్వాత ఆమె తిరిగి బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే అక్కడ కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

పూనమ్ చివరిగా కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది. దీని ద్వారా రియల్‌ పూనమ్‌ ప్రేక్షకులకు పరియం అయ్యింది. ఇక ఇమె 2013లో నాషా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో బోల్డ్‌గా నటించి మెప్పించింది. అయితే మూవీస్‌ కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మోడల్‌గా గుర్తింపు పొందిన పూనమ్‌ పాండే.. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు.. భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవ్వడం మాత్రమే కాక ఆమెను ఫేమస్‌ చేశాయి.

ఢిల్లీలో జన్మించిన పూనమ్‌.. అక్కడే పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీల్లో టాప్‌ టెన్‌లో 8వ స్థానంలో నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత బోల్డ్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ వివాదాస్పద నటిగా మిగిలింది. ఆమె వైవాహిక జీవితంలో కూడా అనేక గొడవలు జరిగాయి. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించడమే కాకుండా అతని నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి పూనమ్‌ ఒంటరిగానే జీవిస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న ఆమె తుది శ్వాస విడింది.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss