iDreamPost
android-app
ios-app

రెండేళ్లుగా ఆ వ్యాధితో నరకం.. డాక్టర్‌ను కలిసిన పూనమ్‌ కౌర్‌!

  • Published Feb 02, 2024 | 3:47 PM Updated Updated Feb 02, 2024 | 3:47 PM

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గత కొంతకాలంగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాాజాగా ఈ వ్యాధికిి సంబంధించి ఓ వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇంతకి అతను ఎవరంటే..

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గత కొంతకాలంగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాాజాగా ఈ వ్యాధికిి సంబంధించి ఓ వ్యక్తిని కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇంతకి అతను ఎవరంటే..

  • Published Feb 02, 2024 | 3:47 PMUpdated Feb 02, 2024 | 3:47 PM
రెండేళ్లుగా ఆ వ్యాధితో నరకం.. డాక్టర్‌ను కలిసిన పూనమ్‌ కౌర్‌!

నటి ‘పూనమ్ కౌర్’.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె మొదటిగా సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన మాయాజాలం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక మొదటి సినిమాలోనే తన అందంతో ఆకట్టుకున్న పూనమ్ కు ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే.. ‘ఒక చిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’, ‘నెక్స్ట్ ఏంటి’వంటి సినిమాల్లో నటించిన, అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే ఆ తర్వాత ఈమె నటించిన ‘వినాయకుడు’ అనే సినిమా మాత్రం పూనమ్ కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కనుమరగవ్వడంతో పెద్దగా సినిమాల్లో కనిపించ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా పూనమ్ తీవ్ర ఆనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వాళ్ల ఆమె కనీసం తన దుస్తువులు కూడా ధరించి లేని పరిస్థితి ఏర్పాడిందని పేర్కొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి పేరు ‘ఫైబ్రోమైయాల్జీయా’ అని ఇది గత రెండేళ్లుగా తనని ఇబ్బంది పెడుతుందని పేర్కొంది. కాగా, 2022 సమయంలో ఆమెకు తీవ్ర వెన్ను నొప్పి రావడంతో చికిత్స కోసం కేరళ వెళ్లారు. అక్కడ కొన్నేళ్లు చికిత్స తీసుకునే క్రమంలో ఆమెకు ఈ ‘మయాల్జియా’ వ్యాధి నిర్ధారణ అయ్యింది. అయితే ఈ విషయం పై పూనమ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు తాజాగా తన ఆరోగ్యం పై ఎక్స్ ఖాతాలో కొత్త పోస్ట్ చేసింది.

అందులో నేచురోపతి వైద్యంలో ప్రసిద్ధిలైన డా. మంతెన సత్యనారయణ రాజును పూనమ్ కలుసుకున్నట్లు తెలిపింది. అలాగే ఆయన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింద. దీనితో పాటు ఫైబ్రోమైయాల్జీయా వైద్యనికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో ఉపాయోగకరమనవి. ఇలాంటి మంచి మనసుగల వ్యక్తిని ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం కలగడం తన అదృష్టమని ఆమె పేర్కొంది. అయితే ఈ వ్యాధితో తాను చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. కనీసం దుస్తువులు కూడా ధరించలేక పోయానని, ఆ సమయంలో విపరీతంగా పెయిన్స్ వచ్చేవని వాపోయింది. అందుకే ఎప్పుడూ వదులుగా ఉన్న దుస్తువులే ధరించాల్సి వచ్చేదని చెప్పింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పూనమ్ చివరిగా ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో నటించింది. అయితే ఈమె సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరుచుగా పాలిటిక్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. మరి పూనమ్ కి వచ్చే ఫైబ్రోమైయాల్జియాలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలేమగా.. నిద్రలేక పోవడం, అలసటతో పాటు శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని కలిగి ఉంటుంది. అలాగే మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద ఎక్కువ పెయిన్ ఉంటుంది. దీనితోపాటు జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సరైన మందులు లేవని వైద్యులు చెబుతున్నారు. కానీ, జీవనశైలి మార్పులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు. మరి, ఫైబ్రోమైయాల్జీయా వ్యాధితో బాధపడుతున్న పూనమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss