iDreamPost
android-app
ios-app

Pooja Hegde: చంపేస్తామంటూ ‘బుట్టబొమ్మ’కు బెదిరింపులు! టీమ్ క్లారిటీ..

  • Published Dec 14, 2023 | 3:48 PM Updated Updated Dec 14, 2023 | 3:48 PM

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.

  • Published Dec 14, 2023 | 3:48 PMUpdated Dec 14, 2023 | 3:48 PM
Pooja Hegde: చంపేస్తామంటూ ‘బుట్టబొమ్మ’కు బెదిరింపులు! టీమ్ క్లారిటీ..

సాధారణంగా సెలబ్రిటీలకు కొంత మంది ఆగంతకుల నుంచి బెదిరింపులు వస్తుంటాయి. గతంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ.. బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయన్న వార్త ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ వార్త రావడానికి కారణం ఏంటి? పూజా టీమ్ దీనిపై ఇచ్చిన క్లారిటీ ఏంటో? తెలుసుకుందాం పదండి.

పూజా హెగ్డే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి.. వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? కొంత మంది ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారట. అసలు విషయం ఏంటంటే? ఇటీవలే బుట్ట బొమ్మ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారని, అక్కడ ఆమెకు కొందరితో గొడవ జరిగిందని, దీంతో వారు ఆమెను చంపుతామని బెదిరిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పూజా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ కు ఏం జరిగిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.

తాజాగా ఈ న్యూస్ పై పూజా టీమ్ స్పందించింది. “ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి. అసలు ఎందుకు ఇలాంటి ఫాల్స్ న్యూస్ సృష్టిస్తారో అర్ధం కావడంలేదు” అంటూ ఆమె టీమ్ పేర్కొంది. దీంతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తను డిలీట్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో పూజాకు బిగ్ క్రేజ్ వచ్చింది. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ కు బ్రేకిచ్చి హిందీ ప్రాజెక్ట్ లపై దృష్టిపెట్టింది ఈ పొడుగు కాళ్ల సుందరి. చివరిగా సల్మాన్ ఖాన్ ‘కిసీ కా బాయ్ కిసీకి జాన్’ సినిమాలో కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş