iDreamPost
android-app
ios-app

వీడియో: సింగర్ ఊర్వశిపై నోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు.. ఎందుకంటే?

  • Published Sep 15, 2023 | 9:56 PM Updated Updated Sep 15, 2023 | 9:56 PM
  • Published Sep 15, 2023 | 9:56 PMUpdated Sep 15, 2023 | 9:56 PM
వీడియో: సింగర్ ఊర్వశిపై నోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు.. ఎందుకంటే?

మాములుగా తమ అభిమాన సింగర్స్ పాటలు పాడితే చప్పట్లు, విజిల్స్, కేరింతలతో ఆడియెన్స్ హోరెత్తించడం మనకు తెలిసిన విషయమే. సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది. మరి అంతటి ప్రాధాన్యత ఉన్న సంగీతానికి సాధారణ మానవులు వినసొంపైన పాటలకు ముగ్థులవకుండా ఉండలేరు కదా. ఇదే విధంగా ఓ ప్రాంతంలో జరిగిన సంగీత కచేరీలో తన పాటలతో ఓలాలాడించిన సింగర్ పై నోట్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షలు విలువ చేసే కరెన్సీ నోట్లను ఆమెపై వెదజల్లారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ గాయనిపై నోట్ల వర్షం కురిపించడానికి కారణం ఏంటంటే?

గుజరాత్ లోని కచ్ లో గోశాల ఏర్పాటు కోసం నిధుల సేకరణలో భాగంగా సంగీత కచేరీని నిర్వహించారు. కాగా ఈ సంగీత కచేరీకి జానపద గాయని ఊర్వశీ రాధాదియాను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింగర్ ఊర్వశీ తన అద్భుతమైన గాత్రంతో పాటలు పాడుతూ ప్రేక్షకులని మైమరపించింది. సంగీత సాగరంలో ముంచెత్తింది. ఇక ఆమె పాటలకు ముగ్ధులైన ఆడియెన్స్ ఆమెపై నోట్ల వర్షం కురిపించారు. వేదికపై తన బృందంతో పాటలు పాడుతున్న ఊర్వశీపై నోట్లు కురిపించడంతో వేదికంతా నోట్లతో నిండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom