iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో అఖీరా ఎంట్రీ పై హాట్ టాపిక్.. ఎంట్రీకి రెడీనా!

  • Published Nov 07, 2024 | 5:11 PM Updated Updated Nov 07, 2024 | 5:11 PM

Akira Nandan : పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత కొద్దీ రోజులుగా అఖీరా గురించి ఎదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఇది కాస్తా నిజం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Akira Nandan : పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత కొద్దీ రోజులుగా అఖీరా గురించి ఎదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఇది కాస్తా నిజం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 07, 2024 | 5:11 PMUpdated Nov 07, 2024 | 5:11 PM
ఇండస్ట్రీలో అఖీరా ఎంట్రీ పై హాట్ టాపిక్.. ఎంట్రీకి రెడీనా!

ఇండస్ట్రీలో తరం మారుతుంది. వారసుల ఎంట్రీ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు కొత్త యుద్దానికి రెడీ అవుతున్నారు. ప్రేక్షకులు కూడా వారికి ఓపెన్ హార్ట్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. వీరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ ఎంట్రీ అందరికి హాట్ టాపిక్ గా మారింది. అంతకముందు వరకు అకీరా నందన్ గురించి బజ్ ఏమి లేదు. కానీ ఈ మధ్యన మాత్రం తెగ వైరల్ అవుతున్నాడు. అఖీరా ఓజిలో క్యామియో చేస్తున్నాడంటూ.. రీసెంట్ గా ఓ న్యూస్ కూడా బాగా సౌండ్ చేసింది. కానీ దీనిపై మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ రాలేదు. క్యామియో సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ ఎంట్రీ గురించే డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు పవన్ వారసుడి వంతు వచ్చింది.

త్వరలో అఖీరా ఎంట్రీ అయితే కన్ఫర్మ్. అది ఓజి నా లేదా మరో సినిమానా అని అయితే క్లారిటీ లేదు. కానీ అందుకు బీజం పడిందన్న వార్తలు మాత్రం క్లియర్ గా వినిపిస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కూడా చాలా సందర్భాల్లో అఖీరా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చారు. ఇక అఖీరాకు కూడా ఒక హీరోలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అఖీరా స్కిల్స్ , లుక్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అఖీరా న్యూయార్క్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు అతను సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అక్కడే యాక్టింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు తండ్రి బాటలోనే కొడుకు కూడా నడుస్తున్నాడు . అఖీరా ఎంట్రీ గురించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ.. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే మాత్రం పవన్ అభిమానులు అఖీరాకు బ్రహ్మరథం పడతారన్న మాట వాస్తవం.

అటు అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా అఖీరా ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఎలాంటి కథలను ఎంచుకుంటాడు. ఏ దర్శకుడి ద్వారా లాంచ్ అవుతాడు.. తండ్రి స్టార్ డం ను క్యారీ చేయగలుగుతాడా లేదా.. అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ కుర్రాడు హీరోగా రాణించే రోజు ఎప్పుడు వస్తుందో.. ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు , ఓజి సినిమాల షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా లైన్ లో ఉంది. కానీ దీని గురించి మాత్రం ఎప్పుడు ఏంటి అనే అంతగా టాక్ వినిపించడం లేదు. ఏమౌతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş