వీడియో: పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్లో మంట పెట్టేశారు!

Pawan Fans Over Action: రీ రిలీజ్ ల సమయంలో ఫ్యాన్స్ హంగామా చేయడం సహజమే. కానీ, పవన్ ఫ్యాన్స్ బీభత్సం చేస్తున్నారు.

Pawan Fans Over Action: రీ రిలీజ్ ల సమయంలో ఫ్యాన్స్ హంగామా చేయడం సహజమే. కానీ, పవన్ ఫ్యాన్స్ బీభత్సం చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోలు నటించిన అలనాటి సూపర్ హిట్ చిత్రాలను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసుకుని ఆనంద పడుతున్నారు. ఆ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ని ఏవో మంచి పనులకు వాడతాం అంటూ చెబుతున్నారు. ఈ రీ రిలీజ్ ల సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర హడావుడి హడావుడి చేసేస్తారు. ఫ్లెక్సీలు, కటౌట్లు, పూల దండలు అంటూ చాలానే చేస్తారు. ఇప్పుడు ఆ పిచ్చి మరో స్థాయికి కూడా చేరుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లలో నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది.

రీ రిలీజ్ లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. రీ రిలీజ్ అంటేనే థియేటర్ యాజమాన్యం భయంతో వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మూవీ రీ రిలీజ్ అంటే థియేటర్ల యజమానులు గడగడలాడిపోతున్నారు. గతంలో సినిమా రీ రిలీజ్ లో కుర్చీలు మొత్తం విరగ్గొట్టి నానా హంగామా చేశారు. థియేటర్ యజమాని మా పరిస్థితి ఏంటి అంటూ ధీనంగా వీడియో కూడా పెట్టాడు. అందరు స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్లు ఒకెత్తు అయితే పవన్ కల్యాణ్ మూవీ వస్తోంది అంటే ఇంలాటి ఘటనలే జరుగుతున్నారు. తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీ రిలీజ్ చేశారు. ఇంకేముంది ఈసారి థియేటర్లో ఏకంగా మంట పెట్టేశారు. స్క్రీన్ ముందు మంట పెట్టి దాని చుట్టూ డాన్సులు చేశారు.

జనసేన జెండాలు తీసుకొచ్చి నానా హంగామా చేశారు. థియేటర్లో ఇలాంటి పనులు చేయకూడదు అనే కనీస అవగాహన లేకుండా వాళ్లు ప్రవర్తించిన తీరు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన తర్వాత నెటింజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మంటలు వేస్తున్నారు.. అగ్ని ప్రమాదం జరిగితే ఎంత మంది ప్రాణాలు పోతాయో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అభిమానం పేరుతో మరీ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నామో? ఏం చేస్తున్నామో కూడా ఒళ్లు తెలియకుండా పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలను కనీసం పవన్ కల్యాణ్ కూడా ఖండించడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత కలిగిన హీరోగా తన సినిమాల రీ రిలీజ్ లను నిలిపివేయాలని కోరుతున్నారు.

ఇలాంటి పనులు హర్షించదగినవి కాదని చెబుతున్నారు. కొందరైతే 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉప్హార్ థియేటర్ షార్ట్ సర్క్యూట్ ట్రాజెడీని గుర్తుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా థియేటర్లో మంటలు చెలరేగి మొత్తం 59 మంది చనిపోగా.. వంద మందికి పైగా గాయాలు అయ్యాయి. ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ.. అలాంటి ప్రమాదాలు జరిగేదాకా మీ ప్రవర్తనలో మార్పు రాదా అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. థియేటర్లో అంత మంది ఉన్నారు.. వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. మరి.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ మంటలు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments