iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్ భర్తకు తప్పిన పెను ప్రమాదం?

  • Published May 01, 2024 | 11:33 AM Updated Updated May 01, 2024 | 11:33 AM

Parineeti Chopra: ఓ స్టార్ హీరోయిన్ భర్తకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Parineeti Chopra: ఓ స్టార్ హీరోయిన్ భర్తకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published May 01, 2024 | 11:33 AMUpdated May 01, 2024 | 11:33 AM
స్టార్ హీరోయిన్ భర్తకు తప్పిన పెను ప్రమాదం?

సెలబ్రిటీలకు సంబంధించిన వార్తల గురించి అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర వేడుకలకు సంబంధించిన న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అలానే వారికి సంబంధించిన ప్రమాద వార్తల కూడా తరచూ మనం చూస్తుంటాము. ఇటీవలే సినీ నటుడు రఘబాబు కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కి భర్తకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మరి..  స్టార్ హీరోయిన్ ఎవరు, ఆమె భర్తకు తప్పిన పెను ప్రమాదం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏదైనా మన ఆరోగ్యానికి సంబంధించి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అలానే కొన్ని సార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటే పెను ప్రమాదమే చోటుచేసుకుంటుంది. అలానే తాజాగా ఓ  హీరోయిన్ భర్త విషయంలో పెను ప్రమాదం తప్పింది. స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆమె రాఘవ్ చద్దాను వివాహ మాడిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీగా  రాఘవ్ చద్దా ఉన్నారు. ఆయన ప్రస్తుతం లండన్ లో ఉండి కంటికి చికిత్స పొందుతున్నారు. అయితే ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనన అరెస్ట్‌ చేసి జైలుకెళ్లిన సమయంలో పెట్టారు. దీంతో  ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా ఒక్కసారి కూడా  అదృశ్యమయ్యాడు. దీంతో అతడు కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే ప్రశ్నను ఢిల్లీ ప్రభుత్వం మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను అడిగితే.. ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. రాఘవ్ చద్దా తీవ్రమైన కంటి సమస్య కారణంతో లండన్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కంటి ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్లారని, ఆలస్యమైతే కంటి చూపు పోయే అవకాశం ఉందని అన్నారు.

మీడియాతో మంత్రి సౌరబ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. రాఘవ్ చద్దా యూకేలో ఉన్నాడని తెలిపాడు. అతనికి తీవ్రమైన కంటి సమస్య ఉందని, అది చాలా తీవ్రమైనదని తనకు చెప్పారని మంత్రి తెలిపారు. అలానే ఏమాత్రం ఆలస్యమైతే కంటి చూపు కోల్పేయే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారానికి రాఘవ చద్దా గైర్హాజరు కావడంపై వస్తున్న ఆరోపణలను భరద్వాజ్ ఖండించారు. తమ ఎంపీ రాఘవ్ చద్దా చికిత్స కోసం అక్కడికి వెళ్లాడని, నా ఆశీస్సులు తనకు ఉన్నాయని, త్వరలోనే కోలుకుని ప్రచారంలో పాల్గొంటారని భరద్వాజ్ పేర్కొన్నాడు. రాఘవ్ చద్దా తన భార్య, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. ఆమె తిరిగి వచ్చింది, కానీ రాఘవ్ చికిత్స కారణంగా అక్కడే ఉండిపోయాడు. మొత్తంగా ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేసి ఉంటే  పెను ప్రమాదం జరిగి ఉండేదని వారి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss